https://oktelugu.com/

టాలెంటెడ్ హీరోయిన్ డైరెక్షన్ చేస్తానంటుంది !

టాలీవుడ్ లో నిత్యమీనన్ హిట్ సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత వరుస సినిమాలు చేయలేక చివరకు సీజనల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది కానీ, బిజీ హీరోయిన్ గా మారలేకపోయింది. పైగా ఈ మధ్య కాలంలో నిత్యమీనన్ మరీ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. పెద్దగా అవకాశాలు రావడం లేదు. వచ్చినా సెకెండ్ హీరోయిన్ గానే నిత్యాని చూస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశాలు రావడం కూడా చాలా కష్టంగా మారిందనేది ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతం నిత్యా […]

Written By:
  • admin
  • , Updated On : September 19, 2020 / 03:05 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో నిత్యమీనన్ హిట్ సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చినా, ఆ తరువాత వరుస సినిమాలు చేయలేక చివరకు సీజనల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది కానీ, బిజీ హీరోయిన్ గా మారలేకపోయింది. పైగా ఈ మధ్య కాలంలో నిత్యమీనన్ మరీ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. పెద్దగా అవకాశాలు రావడం లేదు. వచ్చినా సెకెండ్ హీరోయిన్ గానే నిత్యాని చూస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశాలు రావడం కూడా చాలా కష్టంగా మారిందనేది ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతం నిత్యా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ తనని తానూ ప్రమోట్ చేసుకుంటుంది అక్కడా.

    Also Read: రియల్ హీరో అనిపించుకున్న ‘మెగా హీరో’

    అయినా బాలీవుడ్ లో కూడా నిత్యా సక్సెస్ కాలేదు. అయితే ఈ క్రమంలో నిత్యాకు టాలీవుడ్ నుండి అవకాశం ఇవ్వడానికి కొందరు దర్శకులు ముందుకు వస్తున్నా.. ఇది చిన్న పాత్ర, నా క్యారెక్టర్ కీలకంగా ఉండాలి అంటూ నిత్యమీనన్ బాగా షరతులు పెడుతుందట. దాంతో వచ్చే చాన్స్ లు కూడా దాదాపుగా పోతున్నాయట. దీనికితోడు నిత్యామీనన్ పెళ్లి చేసుకొబోతుంది అంటూ ఈ మధ్య బాగా ప్రచారం కూడా జరుగుతుంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకుంటుందని సినీ జనాలు అనుకుంటున్నారు.

    ఇప్పుడు నిత్యమీనన్ మీద మరో రూమర్ కూడా హాల్ చల్ చేస్తోంది. నిత్యమీనన్ డైరెక్టర్ గా మారబోతుందట. అది కూడా వచ్చే ఏడాది అట. రీసెంట్ గా నిత్యమీనన్ ఒక కథను రెడీ చేసిందని, తనలో డైరెక్టర్ గా మారాలనే కోరిక ఎప్పటినుంచో ఉందని.. అందుకే ఆమె పలు సినిమాలకు షూట్ ఎలా చేస్తున్నారు అంటూ సెట్ లోనే ఉంటూ దర్సకత్వం పై జ్ఞానం పెంచుకుందని.. ఇప్పుడు తానూ రాసుకున్న కథతో సినిమా చేయడానికి రెడీ అవుతుందని.. పైగా ఈ సినిమాకు నిర్మాతగా పీవీపీ వ్యవహరించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

    Also Read: డ్రగ్స్ కేసులో తెరపైకి మరో హీరోయిన్ పేరు..!