https://oktelugu.com/

తిరుమల డిక్లరేషన్ వివాదం… చంద్రబాబు, రఘురామ తీవ్ర విమర్శలు?

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వివాదాస్పద ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు తిరుమలకు అన్యమతస్థులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ను సమర్పించి దర్శనం చేసుకున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఈ నిబంధనను పాటించి దర్శనం చేసుకునేవారు. Also Read : ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు? అయితే జగన్ హిందువు అయినప్పటికీ ఆయన కుటుంబం క్రైస్తవాన్ని పాటిస్తోంది. అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 19, 2020 / 03:40 PM IST
    Follow us on

    టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వివాదాస్పద ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు తిరుమలకు అన్యమతస్థులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ను సమర్పించి దర్శనం చేసుకున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఈ నిబంధనను పాటించి దర్శనం చేసుకునేవారు.

    Also Read : ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు?

    అయితే జగన్ హిందువు అయినప్పటికీ ఆయన కుటుంబం క్రైస్తవాన్ని పాటిస్తోంది. అయితే సీఎం జగన్ తిరుమలకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్ నిబంధన గురించి తెలిసినా డిక్లరేషన్ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడడం లేదు. గతంలోనే డిక్లరేషన్ గురించి వివాదం చెలరేగింది. ఈ నెల 23న జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో డిక్లరేషన్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

    ఇలాంటి సమయంలో వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కొత్తగా నిబంధనను తొలగించారా లేక సీఎం కాబట్టి జగన్ కు మాత్రమే మినహాయింపు ఇచ్చారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ వివాదం గురించి రాష్ట్రంలో రచ్చ జరుగుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఎన్నో సంవత్సరాల నుంచి అమలులో ఉన్న నిబంధనను ఇప్పుడు మార్చడం సరికాదని అన్నారు.

    వైవీ సుబ్బారెడ్డి అన్య మతస్థుల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకున్నారనే వివరణ ఇవ్వాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ రఘురామ ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయం అనాచారమని చంద్రబాబు అన్నారు. పాలకులు మారినప్పుడల్లా సాంప్రదాయాలు మార్చకూడదని చెప్పారు. వైసీపీ ఎంపీ రఘురామ సీఎం జగన్ డిక్లరేషన్ ను పాటించకపోవడం సరికాదని తెలిపారు. గతంలో డిక్లరేషన్ కచ్చితంగా అమలు చేయాలని గవర్నర్లు సైతం చెప్పారని రఘురామ వెల్లడించారు.

    Also Read : ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు?