నిత్య మీనన్.. అభినయానికి అందానికి కేరాఫ్ అడ్రెస్. అయితే, అన్నీ ఉన్నా అదృష్టం అనే ఐటమ్ లేని హీరోయిన్. ఒక నటిగా నిత్యాకి ఉన్న గుర్తింపు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ, నిత్యా మీనన్ మాత్రం కెరీర్ లో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కారణాలు ఏమైనప్పటికీ ఆమె సినీ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో నిత్యాకు వచ్చిన గొప్ప అవకాశం ‘భీమ్లా నాయక్’. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి క్రేజ్ మామూలుగా ఉండదు. పైగా నిన్న ఆగస్టు 15 సందర్భంగా రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్ మెంట్, వీడియో గ్లింప్స్ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. నిన్నటి నుండి ఈ సినిమాకి సడెన్ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో నిత్యా మీనన్ గురించి చిన్నపాటి చర్చ మొదలైంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. పైగా నిత్యా మీనన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయిన మనిషి. గత సినిమాల వరకు బాగా లావుగా కనిపించిన ఆమె.. లాక్ డౌన్ లో కొత్తగా ఫిజిక్ పై కసరత్తులు చేసింది.
నిజానికి నిత్య మీనన్ లావు విషయంలోనే ఆమెకు హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ నిత్యా లుక్ ఇప్పుడు మారిపోయింది. పైగా ‘భీమ్లా నాయక్’లో నిత్యా పాత్ర రెగ్యులర్ టైప్ పాత్ర కాదు. నటనకు అవకాశం ఉన్న పాత్ర. కాబట్టి.. నిత్యా మీనన్, పవన్ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ ఇప్పుడు కొంచెం తగ్గింది కూడా.
కాబట్టి..భీమ్లా నాయక్’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని నిత్య మీనన్ హీరోయిన్ గా ఫుల్ బిజీ అవుతుందేమో చూడాలి.