Nithya Menen: హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిత్యామీనన్ ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని నిత్యా మీనన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. అమ్మమ్మతో నిత్యా మీనన్ కి ఉన్న అనుబంధం ఏమిటో కామెంట్స్ తో అర్థమవుతుంది. ‘ఒక శకం ముగిసింది. నీకు వీడ్కోలు అమ్మమ్మ. నువ్వు నా చెర్రీ మాన్. ఇక నుండి జీవితంలో మరొక కోణం చూస్తాను’ అని అమ్మమ్మతో ఉన్న ఒకప్పటి ఫోటోను నిత్యామీనన్ షేర్ చేసింది.
అమ్మమ్మ మరణం నిత్యా మీనన్ ని త్రీవ వేదనకు గురి చేసింది. నిత్యా మీనన్ అమ్మమ్మ మరణవార్త విన్న అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తమ సంతాపం ప్రకటిస్తున్నారు. నిత్యా మీనన్ కి ఒకింత ధైర్యం చెబుతున్నారు. నిత్యా మీనన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. అలా మొదలైంది మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. నాని హీరోగా డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్.
అనంతరం ఇష్క్, సన్ ఆఫ్ సత్యమూర్తి, గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్ చిత్రాలు ఆమె ఫేమ్ తెచ్చాయి. తెలుగులో కూడా నిత్యా మీనన్ ఫేమ్ రాబట్టింది. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో నిత్యా మీనన్ నటిస్తున్నారు. గత ఏడాది భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ కి జంటగా నటించింది. రెబల్ లేడీ పాత్రలో అలరించింది.
మరోవైపు ఆమె వరుసగా వెబ్ సిరీస్లు చేస్తున్నారు. బ్రీత్ సీజన్ 1, సీజన్ 2 లో నిత్యా మీనన్ నటించడం జరిగింది. ఫస్ట్ సీజన్ లో ఆమె లెస్బియన్ పాత్రకు లిప్ లాక్ ఇవ్వడం సంచలనం రేపింది. ఇక వండర్ ఉమన్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం గర్భవతిని అయ్యానంటూ పోస్ట్స్ పెట్టి నిత్యా మీనన్ షాక్ ఇచ్చింది. నిత్యా మీనన్ మంచి సింగర్ కూడా. పలు చిత్రాల్లో పాటలు పాడారు.