https://oktelugu.com/

Mahesh Babu Daughter Sitara: మహేష్ కూతురు సితార తన మొదటి రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా? ఎంత గొప్ప మనసులు తల్లి!

సితార స్వయంగా ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. అంతర్జాతీయ జ్యూవెలరీ సంస్థ పిఎంజే యాడ్ లో సితార నటించారు. ఈ సంస్థ సితార హోర్డింగ్స్ ఏకంగా న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించడం జరిగింది. దీనికి మహేష్ బాబు ఎంతగానో మురిసిపోయాడు. పిఎంజే సంస్థ నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సితార, నమ్రత శిరోద్కర్ పాల్గొన్నారు.

Written By: Shiva, Updated On : July 16, 2023 8:35 am
Mahesh Babu Daughter Sitara

Mahesh Babu Daughter Sitara

Follow us on

Mahesh Babu Daughter Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని అప్పుడే సెలబ్రిటీ హోదా పొందారు. ఆమెకు ఉన్న ఫేమ్ రీత్యా వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు. ఆ మధ్య జీ తెలుగు మహేష్ బాబు, సితారతో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఛానల్ లో ప్రారంభం కానున్న కొత్త సీరియల్స్ ప్రమోషనల్ యాడ్స్ లో నటించారు. అమ్మాయి గారు, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ కి మహేష్, సితార ప్రచారకర్తలుగా వ్యవహరించారు. అలాగే కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించారు.

సితార స్వయంగా ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. అంతర్జాతీయ జ్యూవెలరీ సంస్థ పిఎంజే యాడ్ లో సితార నటించారు. ఈ సంస్థ సితార హోర్డింగ్స్ ఏకంగా న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించడం జరిగింది. దీనికి మహేష్ బాబు ఎంతగానో మురిసిపోయాడు. పిఎంజే సంస్థ నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సితార, నమ్రత శిరోద్కర్ పాల్గొన్నారు.

ఈ క్రమంలో సీతారను మొదటి రెమ్యూనరేషన్ ఏం చేశావ్? అని అడిగారు. నా మొదటి సంపాదన ఛారిటీకి ఇచ్చేశానని సితార స్వయంగా చెప్పారు. ఇటీవల సితార తమ సొంత ఊరు బుర్రిపాలెంలో పేద విద్యార్థులకు సైకిళ్ళు పంచారు. బహుశా అందుకు అయిన ఖర్చు సితార రెమ్యూనరేషన్ కావచ్చు. దానంలో సేవాగుణంలో సితార తండ్రికి తగ్గ కూతురు అని అందరూ కొనియాడుతున్నారు.

మహేష్ బాబు ఎలాంటి ప్రచారం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఏపీ, తెలంగాణలో రెండు గ్రామాలు దత్తత తీసుకున్నారు. అనేక మౌళిక సదుపాయాలు కల్పించారు. ఇక వందల మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మహేష్ బాబు, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. మహేష్ బాబు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం చాలా కాలం వెలుగులోకి రాలేదు.