Nithin Thammudu Movie Trailer: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఘోరమైన ఫేస్ ని అనుభవిస్తున్న నితిన్(Nithin) ఇప్పుడు ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం తో మన ముందుకు వచ్చే నెల 4వ తేదీన రాబోతున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని నాల్గవ తేదీనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) మూవీ టీం కాస్త రిక్వెస్ట్ చేయడం తో జులై 25 కి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ‘కింగ్డమ్’ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వకపోవడం, జులై 4 న థియేటర్స్ కి వచ్చే అవకాశం లేకపోవడం తో మళ్ళీ ‘తమ్ముడు’ చిత్రం జులై 4 కి షిఫ్ట్ అయ్యింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. సాధారణంగా ఏ సినిమాకి అయినా ముందు టీజర్ విడుదల చేస్తారు, ఆ తర్వాత పాటలు, చివర్లో ట్రైలర్ ని విడుదల చేస్తారు. కానీ తమ్ముడు విషయం లో మాత్రం కాస్త విభిన్న పద్దతిలో పోతున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క పాట బయటకు రాలేదు, టీజర్ కూడా విడుదల కాలేదు. కానీ నేడు ఏకంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. సినిమా ఎలా ఉండబోతుందో ముందుగా ఆడియన్స్ కి తెలియాలి, బిజినెస్ జరగాలి అనే ఉద్దేశ్యంతోనే ట్రైలర్ ని మొదటి ప్రమోషనల్ కంటెంట్ గా విడుదల చేశారట. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముందుగా KV గుహన్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ప్రతీ ఫ్రేమ్ లోనూ క్వాలిటీ ఉట్టి పడుతుంది. ఈమధ్య కాలం లో విడుదలైన నితిన్ సినిమాల్లో ఈ రేంజ్ క్వాలిటీ కనిపించలేదు. ట్రైలర్ చూడగానే పాజిటివ్ ఫీలింగ్ కలగడానికి మొట్టమొదటి కారణం ఇదే. అయితే ఈ ట్రైలర్ ని చూసినప్పుడు మనకి అర్థం అయినా విషయం ఏమిటంటే ఇది అక్కా తమ్ముడి సెంటిమెంట్ మధ్య నడిచే సినిమాగా అనిపిస్తుంది.
అక్క కోరిన ఒక కోరిక కోసం ఒక గ్రామానికి అడుగుపెట్టిన హీరో, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనలను ఎలా ఎదురుకున్నాడు?, ఇంతకు వాళ్ళ అక్క కోరిక ఏమిటి అనేది ట్రైలర్ తో అందరిలోనూ ఆసక్తి కలిగించేలా చేసాడు డైరెక్టర్ వేణు శ్రీ రామ్. సినిమా లో ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ చివర్లో హీరో నితిన్ ఒక అమ్మాయిని ఎత్తుకొని పరుగులు తీస్తూ ఉండే షాట్ ఎవరైనా గమనించారా..?, ఆ షాట్ లో ఉన్న అమ్మాయి ఎవరని అనుకుంటున్నారు?, ఆమె మరెవరో కాదు వేణు శ్రీరామ్ కి స్వయానా కూతురు. ఈ చిత్రం తోనే ఆమె ఇండస్ట్రీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఆమెది ఫుల్ లెంగ్త్ పాత్రనా?, లేకపోతే కేవలం ఈ ఒక్క సన్నివేశం లో కనిపిస్తుందా అనేది చూడాలి.