KCR Kaleshwaram Commission: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 నిమిషాలు.. ఏకధాటిగా 10 నిమిషాలు తక్కువ గంట పాటు విచారణ.. అధికారులు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.. ప్రశ్నల పరంపర కురిపిస్తూనే ఉన్నారు. కెసిఆర్ సమాధానాలు చెప్పారు.. వాటితో అధికారులు సంతృప్తి చెందారా? లేదా? అనే విషయాలను పక్కన పెడితే మొత్తానికి కాలేశ్వరం కమిషన్ ఎదుట కెసిఆర్ ను హాజరు పరిచిన విధానాన్నే కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్నది.
కాలేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ దాదాపు 50 నిమిషాల పాటు సాగింది.. కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి కమిషన్ చైర్మన్ పి.సి ఘోష్ అనేక ప్రశ్నలను కెసిఆర్ ఎదుట సంధించారు. ఈ క్రమంలో కేసీఆర్ కమిషన్ కు అనేక డాక్యుమెంట్లను ఇచ్చారు. విచారణ సమయంలో దేవుడి సాక్షిగా మొత్తం నిజాలే చెబుతానని కేసీఆర్ తో చైర్మన్ పి.సి ఘోష్ ప్రమాణం చేయించారు. మొత్తం 18 ప్రశ్నలను కెసిఆర్ కు సంధించారు. ముఖ్యంగా కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చేపట్టిన రి ఇంజనీరింగ్, కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, కేబినెట్ ఆమోదం తెలిపిందా.. ఈ ప్రశ్నలను కమిషన్ వేసింది.. అయితే రీ ఇంజనీరింగ్ ఎందుకు జరపాల్సి వచ్చిందో.. కెసిఆర్ కమిషన్ కు చెప్పారు.. కేబినెట్ ఆమోదంతోనే ప్రతిదీ చేశామని కెసిఆర్ స్పష్టం చేశారు.. స్థలాన్ని మార్చిన విధానం, గోదావరి నీరు లభించే తీరు.. వ్యాస్కోప్ ఇచ్చిన నివేదిక.. ఈ అంశాలను మొత్తం కమిషన్ దృష్టికి కేసిఆర్ తీసుకెళ్లారు. అంతే కాదు లైఫ్ లైన్ కాలేశ్వరం అనే పుస్తకాన్ని కమిషన్ కు కెసిఆర్ ఇవ్వడం విశేషం.. అందులో కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఉద్దేశ్యాలను ఆయన వివరించారు.. కార్పొరేషన్ ను నిధుల సేకరణ కోసమే ఏర్పాటు చేశామని.. ఇక బ్యారేజీలలో నీటి నిల్వను చేయడం అనేది ఇంజనీర్లు తీసుకున్న నిర్ణయమని.. దానితో నాకు సంబంధం లేదని కెసిఆర్ వెళ్లండి ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆ ఆదేశాలు ఇవ్వలేదు
బ్యారేజీలలో నీటిని నిల్వ చేయడానికి ఆదేశాలు ఇచ్చారా? అని కమిషన్ ప్రశ్నిస్తే.. నీటిని ఎత్తిపోవడానికి మాత్రమే బ్యారేజీలు నిర్మించామని.. కెసిఆర్ పేర్కొన్నారు.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్థల మార్పు నిర్ణయం ఎవరిది అని అధికారుల బృందం ప్రశ్నిస్తే.. మార్పు వెనుక ఉద్దేశాన్ని కెసిఆర్ వివరించారు.. తుమ్ముడి హట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్ల.. సి డబ్ల్యూ సి ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకొని.. గ్యాస్ గ్రూప్ చేసిన సర్వే ను ప్రామాణికంగా తీసుకొని.. సాంకేతిక బృందం మూడు బ్యారేజీలు నిర్మించాలని వివరించిందని కెసిఆర్ పేర్కొన్నారు.. తుమ్మిడి హట్టి వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి “మహా” ప్రభుత్వం ఒప్పుకోలేదని.. సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగానే స్థల మార్పు జరిగిందని.. అవన్నీ కూడా కేబినెట్ ఆమోదంతోనే చేశామని కేసీఆర్ వివరించారు.. కవిచరణ అనంతరం బి ఆర్ కే భవన్ ఎదుటి నుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ కేసీఆర్ వెళ్లిపోయారు.. అంతకంటే ముందు విచారణలో భాగంగా తన వ్యవసాయ క్షేత్రం నుంచి కెసిఆర్ బి.ఆర్.కె భవన్ వచ్చారు.. తనకు జలుబు ఉండడంతో ఓపెన్ కోర్టు విచారణ వద్దని చెప్పడంతో.. దానిని కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత ముఖాముఖిగా కమిషన్ సభ్యులు కేసీఆర్ ను విచారించారు. ఇక కాలేశ్వరం కమిషన్ ఇప్పటివరకు ఏకంగా 114 మందిని విచారించడం విశేషం.