https://oktelugu.com/

చిన్న సినిమాలకు అడ్డుగా నితిన్ ‘చెక్’ !

‘బీష్మ’ లాంటి సూపర్ హిట్ తరువాత యూత్‌ స్టార్‌ నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రానున్న ‘చెక్’ సినిమా విడుదల తేదీ మారింది. మొదట ఫిబ్రవరి 19న గ్రాండ్‌గా సినిమాని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, ఆశ్చర్యకరంగా ‘చెక్’ రిలీజ్ డేట్‌ను హఠాత్తుగా మార్చేశారు. ఈ చిత్రం 19న కాకుండా 26న విడుదల కానున్నట్లు ప్రకటించారు. కాకపోతే అదే రోజున రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’; ‘అక్షర’ సినిమాలకు ఇది బాగా ఇబ్బందికరమే. […]

Written By:
  • admin
  • , Updated On : February 5, 2021 / 05:32 PM IST
    Follow us on


    ‘బీష్మ’ లాంటి సూపర్ హిట్ తరువాత యూత్‌ స్టార్‌ నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రానున్న ‘చెక్’ సినిమా విడుదల తేదీ మారింది. మొదట ఫిబ్రవరి 19న గ్రాండ్‌గా సినిమాని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, ఆశ్చర్యకరంగా ‘చెక్’ రిలీజ్ డేట్‌ను హఠాత్తుగా మార్చేశారు. ఈ చిత్రం 19న కాకుండా 26న విడుదల కానున్నట్లు ప్రకటించారు. కాకపోతే అదే రోజున రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’; ‘అక్షర’ సినిమాలకు ఇది బాగా ఇబ్బందికరమే. అసలుకే ఎ1 ఎక్స్‌ప్రెస్, అక్షర సినిమాల పై ఎలాంటి అంచనాలు లేవు.

    Also Read: ప్రభాస్ పెళ్లి.. బడా బిజినెస్‌మెన్ కూతురితో.. !

    ఇలాంటి సినిమాల పై నితిన్ ‘చెక్’ వస్తే.. కచ్చితంగా ఆ చిన్న సినిమాల కలెక్షన్స్ పూర్తిగా డల్ అవుతాయి. మరి చూడాలి ఎలా మ్యానేజ్ చేస్తారో ఆ చిన్న సినిమాల మేకర్స్. పైగా ఈ నెలలో వస్తున్న సినిమాల్లో ఎక్కువ అంచనాలున్నది ‘చెక్’ మీదే. అందుకే ఆ సినిమాకు ఎవరూ పోటీ వెళ్లడం లేదు. కానీ, ఆల్రెడీ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్న చిన్న సినిమాల పై కావాలని పోటీకి దిగాడు నితిన్. మరి ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’; ‘అక్షర’ సినిమాల మేకర్స్ తమ సినిమాల రిలీజ్ డేట్లును మార్చుకుంటారో లేదో చూడాలి.

    Also Read: మెగాస్టార్ సినిమాలో ముగ్గురు హీరోలు !

    కాగా ”జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్‌ చెక్. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు. ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ లా ఉంది ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం అట. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందట. ఇటీవల రిలీజ్‌ చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని చెబుతున్నారు చెక్ మేకర్స్ . వారి మాటలకు తగ్గట్టే సినిమాలో మ్యాటర్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నితిన్‌ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్