https://oktelugu.com/

‘శృతి హాసన్’ డేటింగ్ చేసినవారంతా వాళ్ళే !

35 ఏళ్ల ‘శృతి హాసన్’ ఓ స్టార్ హీరో కూతురు.. అసలు ఆమెకు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా శృతి హాసన్ కి గ్లామర్ అన్నా, ఎక్స్ పోజింగ్ అన్నా విపరీతమైన ఇష్టమట. అందుకే కావాలని సినిమాల్లోకి వచ్చి ఎక్స్ పోజింగ్ విషయంలో కమర్షియల్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్ రోల్స్ లో రెచ్చిపోయి నటిస్తూ మరీ ముందుకు సాగుతుంది. ఇక శృతి హాసన్ మరోసారి తన పర్సనల్ లైఫ్ […]

Written By:
  • admin
  • , Updated On : February 5, 2021 / 05:47 PM IST
    Follow us on


    35 ఏళ్ల ‘శృతి హాసన్’ ఓ స్టార్ హీరో కూతురు.. అసలు ఆమెకు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా శృతి హాసన్ కి గ్లామర్ అన్నా, ఎక్స్ పోజింగ్ అన్నా విపరీతమైన ఇష్టమట. అందుకే కావాలని సినిమాల్లోకి వచ్చి ఎక్స్ పోజింగ్ విషయంలో కమర్షియల్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా బోల్డ్ రోల్స్ లో రెచ్చిపోయి నటిస్తూ మరీ ముందుకు సాగుతుంది. ఇక శృతి హాసన్ మరోసారి తన పర్సనల్ లైఫ్ విషయాలతో వార్తల్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించడంతో మరోసారి ఆమె లవ్ లైఫ్ గురించి పుకార్లు మొదలైపోయాయి.

    Also Read: ప్రభాస్ పెళ్లి.. బడా బిజినెస్‌మెన్ కూతురితో.. !

    ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసినా ఈ ముదురు భామ, మళ్ళీ కొత్తగా కొత్త ప్రియుడ్ని వెతుక్కుంది. గతంలో పలువురు హీరోలతో ఆమె సన్నిహితంగా మెలిగింది. వారిలో సిద్ధార్ధ్, ధనుష్ ఇలా కొంతమంది హీరోలతో డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. అలాగే క్రికెటర్ సురేష్ రైనాతో ఆమె క్లోజ్ ఫ్రెండ్షిప్ గురించి అప్పట్లో గాసిప్స్ వచ్చాయి. అయితే ఆమె స్వయంగా ఒప్పుకున్న లవ్ స్టోరీలు మాత్రం రెండు.. ఒకటి హీరో సిద్ధార్థ్ తో. రెండోది ఇటాలియన్ మైఖేల్ కొర్సాల్ తో. మైఖేల్ తో ఆమె తన ఘాటు ప్రేమాయణాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ లోకానికి వ్యక్తపరుస్తూనే వచ్చింది.

    Also Read: మెగాస్టార్ సినిమాలో ముగ్గురు హీరోలు !

    అసలు ఆ మాటకొస్తే.. తన ఘాటు రొమాన్స్ ను శ్రుతి ఎన్నడూ దాచుకోలేదు. తనే స్వయంగా ఫోటోలు పోస్ట్ చేస్తూ.. తనలోని విరహవేదనను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు శాంతను హజారికాతో డేటింగ్ లో ఉంది శృతి. ఇతను ‘ఆర్ట్’ వేస్తుంటాడట. అలాగే మ్యూజిషియన్ కూడా అని తెలుస్తోంది. నిజానికి ఒక్క సురేష్ రైనా తప్ప ఆమె ఇప్పటివరకు డేటింగ్ చూసినవారంతా నటన, మ్యూజిక్ రంగాలకు చెందినవారే కావడం విశేషం. అంటే, శ్రుతి హాసన్ కు ‘కళాకారులు’ అంటేనే ఇష్టం అనుకుంటా.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్