
‘బీష్మ’ సినిమా నితిన్ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. పైగా ఆ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఆ సినిమా తరువాత యూత్ స్టార్ అయిపోయాడు నితిన్. ఇలాంటి హిట్ ట్రాక్ లో ఉన్న నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నిన్నటి ఆదివారం రిలీజ్ అయిన సినిమా ‘చెక్’. అయితే నితిన్ లాంటి హీరోకి మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ, ఈ సినిమాకు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పట్టుమని 2 కోట్ల రూపాయల షేర్ కూడా రాలేదంటేనే.. ఈ సినిమా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Also Read: నటి హిమజకు లేఖ రాసి సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్.. కారణమిదే?
మొదటి వారాంతం గడిచేసరికి నితిన్ సినిమా యావరేజ్ స్థాయి నుంచి ఫ్లాప్ రేంజ్ కు పడిపోయింది. ”జైలు నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అంటేనే జనం దూరం జరుగుతున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమే. ఒక ఫామ్ లో ఉన్న హీరోకి మరీ ఇంత వరెస్ట్ కలెక్షన్స్ రావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. నితిన్ ‘చెక్’కి ఉప్పెన తప్ప గట్టిగా పోటీ ఇచ్చే సినిమా కూడా లేదు. భారీ పోటీ ఉంటే కచ్చితంగా సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. కానీ పెద్దగా పోటీ లేకపోయినా కలెక్షన్స్ తగ్గడం అంటే అది నితిన్ కెరీర్ కే పెద్ద మైనస్.
Also Read: ఆమె గ్రేసే ఆ డైరెక్టర్ కి ప్లస్ !
నిజానికి ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం. పైగా ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. అయినా జనం పట్టించుకోకపోవడం విచిత్రమే. అసలు ఇలాంటి సినిమాకే ఇంత వరెస్ట్ కలెక్షన్స్ వస్తే.. ఇక వచ్చే వారం రానున్న సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’; సాగర్ ‘షాదీ’ రాజ్ తరుణ్ సినిమాల పరిస్థితి ఏమిటో ?
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్