నితిన్ ‘అంధాదున్’ షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెల్సిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం నటీనటులతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలిషాట్ కు శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, దర్శకుడు సురేందర్ రెడ్డి తొలిషాట్ తీశారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గతంలోనే ‘అంధాదున్’ రీమేక్ హక్కులను దక్కించుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ అవుతుంది. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో ఈ […]

Written By: Neelambaram, Updated On : February 24, 2020 3:18 pm
Follow us on

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెల్సిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం నటీనటులతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలిషాట్ కు శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, దర్శకుడు సురేందర్ రెడ్డి తొలిషాట్ తీశారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గతంలోనే ‘అంధాదున్’ రీమేక్ హక్కులను దక్కించుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాదున్’ తెలుగులో రీమేక్ అవుతుంది. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

ఈ మూవీలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నాడు. అంధుడైన వ్యక్తి ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. చట్టానికి నిందితులను ఎలా పట్టించాడు అనేది కథ.. అనేక ట్వీస్టులు, సస్పెన్స్ తో ఆకట్టుకునేలా చిత్రాన్ని బాలీవుడ్లో తెరకెక్కించారు. ఈ మూవీని తెలుగు నెటివీటికి అనుగుణంగా మార్పులుచేసి రీమేక్ చేస్తున్నారు. నితిన్ సరసన హబ్బాపటేల్ ఎంపికైనట్లు సమాచారం. ‘అంధాధున్’ మూవీలో అద్భుత నటన కనబర్చిన ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు.

దర్శకుడు మేకపాటి గాంధీ వెంకట్రాది ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా చేసిన కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో ‘అంధాదున్’ రీమేక్ తో విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. నితిన్ తాజాగా ‘భీష్మ’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సస్ అందుకున్నాడు. నితిన్-రష్మిక జోడికి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. ‘అంధాదున్’ రీమేక్ లైన్లో పెట్టిన నితిన్ ఆ వెంటనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘రంగ్ దే’ మూవీ చేయబోతున్నారు. బాలీవుడ్లో విమర్శల ప్రశంసలు అందుకున్న ‘అంధాదున్’ తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.