Nithiin’s Remuneration: గత 23 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు నితిన్ (Nithin)…2002 లో జయం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన దిల్(Dil), సై (Sye) సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపైతే వచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలు అతన్ని చాలా వరకు నిరాశపరిచినప్పటికి పట్టువదలని విక్రమార్కుడిలా సినిమా చేసి మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన అడపాదడప సక్సెస్ లను మాత్రమే సాధిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో తమ్ముడు (Tammudu) అనే సినిమా చేశాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ లో దిల్ రాజు (Dil Raju)మాట్లాడుతూ నితిన్ కి కథ చెప్పిన తర్వాత నీకు రెమ్యూనరేషన్ ఎంత కావాలి అని అడగగా ఎంతో కొంత ఇచ్చేయండి..
Also Read: Nithin: నితిన్ ‘తమ్ముడు’ మూవీ స్టోరీ ఇదేనా?..ఈసారి గురి తప్పేలా లేదుగా!
ఫస్ట్ అయితే సినిమా చేద్దామని చెప్పాడట. దానికి దిల్ రాజు నితిన్ కి థాంక్స్ చెప్పాడు. నిజానికి ప్రతి హీరో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా సినిమా బడ్జెట్ ఎంత అనేది తెలుసుకొని ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ లో ఉంటాడు.
అలాగే హీరోలు కూడా మంచి రెమ్యూనరేషన్ ని అందుకొని సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఇండస్ట్రీ బాగుపడుతుంది… ఇది తెలిసిన సినిమా మేధావులు అందరూ నితిన్ లానే ప్రతి హీరో రెమ్యూనరేషన్ విషయంలో తగ్గితే ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ లో ఉండొచ్చు సినిమా టిక్కెట్ రేట్లు కూడా పెంచాల్సిన అవసరం లేదు అంటు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read: Hero Nithin : హీరో నితిన్ కి బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి!
నిజానికి థియేటర్లో సినిమాలను చూడడానికి జనాలు రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సినిమాల మీద ఎక్కువగా బడ్జెట్లు పెట్టేసి టిక్కెట్ రేట్ పెంచేయడం వల్ల ప్రేక్షకులు ఆ అదనపు భారాన్ని మోయలేక థియేటర్లో సినిమాని చూడటం మానేశారు. ఇక ఎలాగో ఒక 20 రోజుల్లో ఆ సినిమా ఓటిటి లోకి వస్తుంది కాబట్టి అందులో సినిమాలను చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పోవాలి అంటే హీరోలు తమ రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించుకోవాల్సిన అవసరమైతే ఉంది…