Hero Nithin : యంగ్ హీరో నితిన్(Hero Nithin) కొంతకాలం గ్యాప్ తర్వాత మరికొద్ది గంటల్లో ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల అవ్వగా, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లీన్ కామెడీ తో పాటు, బ్రెయిన్ గేమ్ తో నడిచే సినిమాగా ‘రాబిన్ హుడ్’ తెరకెక్కిందని అందరూ అర్థం చేసుకున్నారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. కారణం నితిన్ రెండు చిత్రాలు ఫ్లాప్ అవ్వడం, దాని ప్రభావం ఈ సినిమాపై చాలా గట్టిగా చూపించిందని చెప్పొచ్చు. కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు ర్యాంపేజ్ మోడ్ లో ఉంటాయి. ఎందుకంటే ఉగాది, రంజాన్, శ్రీ రామ నవమి వంటి పండుగలు ఉన్నాయి. నితిన్ కి కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు ఇదే మంచి ఛాన్స్.
Also Read : పెద్ది’ టీజర్ విడుదల ఇప్పట్లో లేనట్టే..కారణం ఏమిటంటే!
ఇదంతా పక్కన పెడితే రేపు ఈ సినిమా విడుదల సందర్భంగా కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు నితిన్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్స్ వేశారు. వారిలో ప్రముఖ యంగ్ హీరో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) కూడా ఉన్నాడు. ఒక పక్క ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తూనే మరో పక్క నితిన్ కి క్షమాపణలు చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘నితిన్ గారి రాబిన్ హుడ్ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. దయచేసి నితిన్ నన్ను ఒక విషయం లో క్షమించాలి. గత నెలలో శబ్దం సినిమా విడుదల సందర్భంగా నితిన్ నన్ను ట్యాగ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నేను ప్రొమోషన్స్ లో బిజీ గా ఉండడం వల్ల ఆ రిప్లై ని చూడలేకపోయాను. చాలా ఆలస్యం గా చూసి ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను. అందుకు నన్ను క్షమించండి నితిన్ గారు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇక రాబిన్ హుడ్ సినిమా విశేషాలకు వస్తే ఇందులో శ్రీలీల(Heroine Srileela) హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కి ‘జులాయి’ చిత్రం తర్వాత మంచి కామెడీ రోల్ పడిందని మూవీ టీం మొత్తం చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిల్చిన అంశాలు ఒకటి కేతిక శర్మ చేసిన ‘అది దా సర్ప్రైజ్’ సాంగ్ కాగా, మరొకటి డేవిడ్ వార్నర్ స్పెషల్ రోల్ లో కనిపించడం. ఈ సినిమా ప్రొమోషన్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన పాల్గొని మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ రెండు విశేషాలు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి పెద్దగా ఉపయోగపడకపోయిన, టాక్ వస్తే ఈ అంశాలు సినిమా వసూళ్లకు పెద్ద బూస్ట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
Also Read : రామ్ చరణ్ పుట్టినరోజు ని పట్టించుకోని అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!