Salute to the mother: ఏపీలో ( Andhra Pradesh)కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అధికారం చేపట్టి ఈరోజుకు సంవత్సరం పూర్తవుతుంది. దీంతో సంబరాలకు సిద్ధపడుతోంది కూటమి. మరోవైపు సంక్షేమాన్ని బాట పట్టించాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు తల్లికి వందనం పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధంగానే రూ.13 వేలు జమ చేయాలని నిర్ణయించింది. కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్లో అడ్మిషన్ పొందిన వారి డేటా అందిన తర్వాత పథకం అమలు చేయనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో ఈరోజు ఈ పథకం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read Also: ఒక్క డిజాస్టర్ తో ఇండస్ట్రీ లో కనబడకుండా పోయిన ఎన్టీఆర్ డైరెక్టర్…
రూ. 2 వేలు కోత..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో అమ్మ ఒడి పేరిట పథకం అమలు చేశారు. విద్యార్థి తల్లుల ఖాతాల్లో 13 వేల రూపాయల చొప్పున జమ చేశారు. అయితే 15 వేల లో రెండు వేల రూపాయలను పాఠశాల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణకు గాను కోత విధించారు. అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా రెండు వేల రూపాయల కోత విధించి రూ.13000 అందించనున్నారు. అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందించనున్నారు.
లోకేష్ స్పష్టత..
ఇప్పటికే పథకం అమలుపై సీఎం చంద్రబాబు( CM Chandrababu) స్పష్టతనిచ్చారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు తల్లికి వందనం నిధులు జమ చేస్తామని చెప్పుకొచ్చారు. అనుకూల మీడియాలో సైతం పతాక శీర్షికన యాడ్లు ఇచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ. 8,745 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి రూపాయలు, పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో వెయ్యి రూపాయలు చొప్పున మినహాయించి.. 13 వేల రూపాయలను పళ్ళుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు.
Read Also: ఏపీలో విద్యార్థులకు ‘ట్రావెల్ అలవెన్స్’.. ఎవరికంటే?
సీఎం కీలక ఆదేశాలు..
సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపై ఇప్పటికే సమీక్ష జరిపారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించారు. పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను సీఎం ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో, ఇంటర్ ఫస్టియర్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు. పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి.. నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.