Nithiin Thammudu: ‘రాబిన్ హుడ్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత నితిన్(Hero Nithin) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘తమ్ముడు'(Thammudu Movie). MCA , వకీల్ సాబ్ లాంటి భారీ కమర్షియల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వేణు శ్రీ రామ్(Venu Sriram) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మార్కెట్ లో ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది. నిర్మాత దిల్ రాజు(Dil Raju) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, మేకింగ్ కి 35 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యిందని. ఓవరాల్ సినిమా ని పూర్తి చేయడానికి 75 ఖర్చు బడ్జెట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ మరియు ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి 40 కోట్ల రూపాయిల బిజినెస్ చేసింది ఈ చిత్రం. సాధారణంగా దిల్ రాజు తన ప్రతీ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో కి అమ్ముతాడు.
కానీ ఈసారి రూట్ మార్చి నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఈ చిత్రాన్ని అమ్మేశాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ని జారీ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ట్రైలర్ ని చూసినప్పుడు ప్రతీ ఒక్కరికి అనిపించినా ఫీలింగ్ మంచి ఎమోషన్స్ తో కూడిన మూవీ, దానికి తోడు సినిమా మొత్తం థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కినట్టు ఉంది, కచ్చితంగా డైరెక్టర్ ఎదో కొత్త ప్రయత్నం చేసాడని అందరికీ అనిపించింది. అలాంటి చిత్రానికి A సర్టిఫికేట్ జారీ చేయడం ఏమిటి అని నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సినిమాలో మితిమీరిన హింస, లేకపోతే బూతుల కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి సర్టిఫికేట్స్ ని ఇస్తుంటారు. కానీ థ్రిల్లర్ జానర్ చిత్రానికి కూడా ఇలాంటి రేటింగ్ రావడం మేకర్స్ కి కాస్త నిరాశ కలిగించే విషయమే.
ఇక సెన్సార్ టాక్ విషయానికి వస్తే ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైన నితిన్ చిత్రాలకంటే ది బెస్ట్ గా ఉందని అంటున్నారు. కచ్చితంగా థియేట్రికల్ అనుభూతి పొందాల్సిన సినిమా అని, ఇలాంటి ఎఫెక్ట్స్ ఈమధ్య కాలంలో ఏ సినిమాకి కూడా చూడలేదని చెప్పారట. ఒక పక్క ఫ్యామిలీ ఎమోషన్స్ , మరో పక్క థ్రిల్లింగ్ ఎలిమెంట్స్,ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని చివరి 45 నిమిషాలు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ది బెస్ట్ థ్రిల్లర్ జానర్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు . మరి నిజంగా ఆ రేంజ్ లో ఈ చిత్రం ఉందో లేదో తెలియాలంటే జులై నాల్గవ తేదీ వరకు ఆగాల్సిందే.