Swecha Votarkar Passed Away: స్వేచ్ఛ జర్నలిస్టుగా తన కెరీర్ మొదలుపెట్టింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఆమె పనిచేసింది. ఆ తర్వాత తనకున్న టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగింది. సరిగ్గా సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది.. ఆ తర్వాత అతని ద్వారా ఆమెకు ఒక పాప కలిగింది. అయితే ఈలోపు భార్యాభర్తలకు విభేదాలు తలెత్తాయి. దీంతో స్వేచ్ఛ అతని నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రసారాలు కొనసాగించే ఛానల్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఆ చానల్లో ఆమె కీలక స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఆ ఛానల్ లో గతంలో పని చేసిన ఒక ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనానికి దారితీసింది. ప్రస్తుతం అతడితోనే ఆమె నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. హైదరాబాదులోని చిక్కడపల్లి ప్రాంతంలోని జవహర్ నగర్ ఏరియాలో ఓ బహుళ అంతస్తులో స్వేచ్ఛ నివాసం ఉంటున్నది. స్వేచ్ఛ, ఆమె కూతురు తో పాటు, ఓ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అందులోనే నివాసం ఉంటున్నట్టు సమాచారం.
Also Read: ఓపెనింగ్స్ లో ‘కుబేర’ కి దరిదాపుల్లో రాలేకపోయిన ‘కన్నప్ప’..ప్రభాస్ కూడా కాపాడలేకపోయాడుగా!
ఓ ఛానల్ మాజీ ఉద్యోగి తో సహజీవనం
సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండే స్వేచ్ఛ.. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుతం టీయూడబ్ల్యుజే లో కీలక స్థానంలో పనిచేస్తోంది. అయితే వృత్తిపరంగా ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిన స్వేచ్ఛ.. ఇలా కన్నుమూయడాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ధైర్యంగా ఉండే స్వేచ్ఛ ఇలాంటి పని చేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. అయితే స్వేచ్ఛకు సహజీ వనం చేస్తున్న వ్యక్తికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని.. అందువల్లే ఆమె తన ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధపడిందనే చర్చ నడుస్తోంది..” ఆమె అర్ధాంతరంగా కన్నుమూయడం బాధ కలిగిస్తోంది. ఆమె ఒక న్యూస్ ఛానల్ లో గతంలో పనిచేసిన వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తున్నది. అయితే అతడితో ఇటీవల కాలంలో విభేదాలు ఎదురయ్యాయని సన్నిహితులతో చెప్పుకుంది. అయినా ఆమెకు సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పాపం ఇప్పుడు ఆమె ఒక్కగానొక్క కూతురు అనాధ అయిపోయిందని” ఆమెతో పని చేసిన తోటి పాత్రికేయులు వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే పోలీసులు స్వేచ్ఛతో సహజీవనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతని ద్వారా మరిన్ని వివరాలు రాబట్టి.. స్వేచ్ఛ మరణం వెనుక ఏం జరిగిందో చెప్పే అవకాశం ఉంది.. అయితే కొద్ది రోజులుగా ఆ ఛానల్ మాజీ ఉద్యోగి స్వేచ్ఛ ఉంటున్న ప్లాట్ కు రావడం మానేశాడు అని తెలుస్తోంది. అందువల్లే ఈ వివాదం జరిగి ఉంటుందని సమాచారం.
View this post on Instagram