Nithiin (1)
Nithiin: చాలా కాలం తర్వాత హీరో నితిన్(Hero Nithin) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తనతో భీష్మ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన వెంకీ కుడుముల(Venky Kudumula) తో ఆయన ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ నెల 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని వారం రోజుల క్రితమే ప్రారంభించారు మేకర్స్. సినిమా చాలా బాగా వచ్చింది అనే నమ్మకం రావడంతో మేకర్స్ సినిమాని జనాల్లోకి అన్ని విధాలుగా బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న భీమవరం లో ఒక భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. స్టూడెంట్స్ సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో నితిన్ ని వేదిక పై ఉన్న LED స్క్రీన్ లో మన టాలీవుడ్ హీరోల ఫోటోలు చూపించి వాళ్ళ నుండి ఏ లక్షణాలు దొంగిలిస్తావు అని అడుగుతుంది యాంకర్.
Also Read: అక్షరాలా 150 కోట్లు..చరిత్ర సృష్టించిన ‘డ్రాగన్’..23 వ రోజు ఎంత వసూళ్లు వచ్చిందో తెలుసా?
ముందుగా నాని(Natural Star Nani) ఫోటో ని చూపించి అడగగా ‘ఆయన నుండి స్క్రిప్ట్ సెలక్షన్ లక్షణాన్ని దొంగిలిస్తాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి డైలాగ్ డెలివరీ, మహేష్ బాబు(Superstar Mahesh Babu) నుండి అందం, స్వాగ్ దొంగిలిస్తానని చెప్పుకొచ్చాడు. మీరు ఇప్పటికే చాలా అందంగా ఉన్నారు కదా, మీకు అవసరమా అని అడిగితే, ఇంకా కాస్త బెటర్ అవుదామని అని అంటాడు. ఇక పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఫోటో వచ్చినప్పుడు ‘ఆయన నుండి అన్ని దొంగలించేస్తాను. యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్, స్వాగ్, గ్లామర్ అన్ని నాకే సొంతం’ అని అంటాడు. అప్పుడు యాంకర్ డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా మీకే సొంతమా అని అడిగితే, దానికి నితిన్ సమాధానం చెప్తూ ‘అది తప్ప అన్ని నాకే’ అని అంటాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) ఫోటో రాగా, దానికి సమాధానం చెప్తూ ‘ఆయనలోని మంచి గుణాలను దొంగిలిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే హీరోల ఫోటోలను చూపించినప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ ప్రతీ ఒక్కరికి గట్టిగా కేరింతలు వేశారు కానీ. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫోటోలు వచ్చినప్పుడు మాత్రం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. దీనిని బట్టి యూత్ ఆడియన్స్ లో వీళ్లిద్దరికీ ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఎన్టీఆర్, నాని కి కూడా పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, మహేష్ బాబు కి మాత్రం మిగిలిన హీరోలతో పోలిస్తే చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు. సోషల్ మీడియా లో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఇక ‘రాబిన్ హుడ్’ విషయానికి వస్తే ఇటీవలే విడుదలైన ‘సర్ప్రైజ్’ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. కేతిక శర్మ హాట్ డ్యాన్స్ కి కుర్రకారులు మెంటలెక్కిపోయారు. సినిమా మీద కావాల్సినంత హైప్ ఈ పాట క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: ‘దిల్ రూబ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..’లైలా’ కంటే ఘోరమైన డిజాస్టర్..పాపం కిరణ్ అబ్బవరం!