Nikhil’s New Movie: ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికి కొంతమంది మాత్రమే ఇక్కడ టాప్ పొజిషన్ ని దక్కించుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు చేసే సినిమాలతో వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాకు పోటీ ఎవరు లేరు అనే రేంజ్ లో ముందుకు సాగుతున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నిఖిల్(Nikhil) లాంటి నటుడు సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన కార్తికేయ 2 (Karthikeya 2) సినిమా పాన్ ఇండియాలో మంచి విజయాన్ని సాధించడంతో తనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగాడు…ఇక ప్రస్తుతం స్వయంబు (Swayambhu) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన మరో కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. ‘ది ఇండియా హౌస్ ‘ (The Indian House) ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే సముద్రానికి సంబంధించిన సీన్ ని షూట్ చేయడానికి పెద్ద పెద్ద ట్యాంకర్లతో సముద్రపు సెట్ ని వేశారు. కానీ అనుకోకుండా ఆ ట్యాంకర్ లలో ఒకటి పగిలిపోవడంతో సెట్ లోకి మొత్తం వాటర్ వచ్చేసింది. దాంతో కెమెరాలు, లైట్లు మొత్తం నీట మునిగిపోయాయి. అలాగే కొంతమంది అసిస్టెంట్ కెమెరామెన్ లకి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. వెంటనే వాళ్ళని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…నిజానికి సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక ఇబ్బంది వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి.
Read Also: ట్రంప్‌తో దోస్తానీ.. కరిగిపోయిన ప్రపంచ కుభేరుడి ఆస్తి..!
కానీ వాటన్నింటికి ముందుగానే చూసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగి గాయాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇలాంటి ప్రమాదం వల్ల ఇటు కెమెరాలు నీట మునిగిపోయి పాడైపోయే ప్రమాదాలు ఉన్నాయి.
మొత్తానికైతే ఎవరికి ప్రాణహాని కలగనప్పటికి కొన్ని గాయాలతో అందరు తప్పించుకోవడం మంచిదయింది. ఆ ట్యాంకర్ పగిలి సెట్ లోకి వాటర్ వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా సినిమా తీయడం అనేది చాలా కష్టం.
ఇలాంటి చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొత్తగా వచ్చే మేకర్స్ కూడా సినిమా షూటింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ సినిమా షూటింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…