Bigg Boss 8 Telugu Winner: చెప్పాలంటే నిఖిల్ కి తెలుగు ఆడియన్స్ లో పెద్దగా ఫేమ్ లేదు. ఆయన ఒకటి రెండు తెలుగు సీరియల్స్ లో నటించారు. నిఖిల్ కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అవినాష్, రోహిణి, హరితేజ తో పాటు పలువురు సీజన్ 8లో కంటెస్ట్ చేశారు. మనలో టాలెంట్ ఉంటే, కష్టపడి ఆడితే, ఆడియన్స్ భాషాబేధం లేకుండా ఆదరిస్తారని తేలిపోయింది. తెలుగు ఆడియన్స్ చాలా బ్రాడ్ మైండెడ్. అందుకే తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు టాలీవుడ్ లో భారీ మార్కెట్ ఉంది. కంటెంట్ ఉంటే, ఎవరి చిత్రాన్నైనా ఎగబడి చూస్తారు.
నిఖిల్ విషయంలో కూడా అదే జరిగింది. నిఖిల్ చాలా సెటిల్డ్ గా ఉంటాడు. టాస్క్ లలో 100 శాతం ఇచ్చాడు. డే వన్ నుండి నిఖిల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా గేమ్ ఆడాడు. ఏ దశలో కూడా అతడు రిలాక్స్ కాలేదు. కూల్ గా కనిపించే నిఖిల్ టాస్క్ లలో మాత్రం తనలోని ఫైర్ బయటకు తీస్తాడు. గెలుపుకోసం చెమటోడుస్తాడు. నిఖిల్ సాధించిన వరుస విజయాలు ఆడియన్స్ లో భారీ పాపులారిటీ తెచ్చాయి.
చివరి వారాల్లో యష్మి విషయంలో నిఖిల్ ఒకింత నెగిటివ్ అయ్యాడు. యష్మితో రిలేషన్ గురించి అతడు చేసిన కామెంట్స్ ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. అయినప్పటికీ నిఖిల్ నిలదొక్కుకున్నాడు. నిఖిల్ కి ఎదురైన అతిపెద్ద ఛాలెంజ్.. నాన్ లోకల్ ట్యాగ్. సోషల్ మీడియాలో నిఖిల్ యాంటీ ఫ్యాన్స్ ఈ ట్యాగ్ తో నెగిటివ్ ప్రచారం చేశారు. ఒక కన్నడ నటుడికి ఎలా ఓట్లు వేస్తారు. తెలుగు ఆడియన్స్ లోకల్ కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేయాలనే కామెంట్స్ తరచుగా వినిపించేవి.
ఈ నాన్ లోకల్ అనే నెగిటివ్ ప్రచారాన్ని కూడా నిఖిల్ తట్టుకుని నిలిచాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌతమ్ కి నిఖిల్ కి గట్టి పోటీ ఎదురైంది. గత మూడు వారాలుగా టైటిల్ పోరు నిఖిల్-గౌతమ్ మధ్య అంటూ గట్టిగా వినిపించింది. ఊహించినట్లే టాప్ 2లో వారిద్దరూ నిలిచారు. ఉత్కంఠకు తెరదించుతూ నిఖిల్ టైటిల్ విన్నర్ అని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. నిఖిల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీ, టైటిల్ తో పాటు బహుమతులు సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ టైటిల్ కొట్టిన నిఖిల్ ఎదుట మరొక టాస్క్ ఉంది. అది రియల్ లైఫ్ టాస్క్. నిఖిల్ కి తన ప్రేయసి దూరమైంది. ఆమెను బ్రతిమిలాడైనా తిరిగి దగ్గర అవుతానని హౌస్లో చెప్పాడు. సీరియల్ నటి కావ్యశ్రీని నిఖిల్ ప్రేమించాడు. వీరిద్దరూ కలిసి గోరింటాకు సీరియల్ లో నటించారు. ఆ సీరియల్ కి చెప్పుకోదగ్గ ఆదరణ దక్కింది. గోరింటాకు సీరియల్ షూటింగ్ సమయంలో కావ్య-నిఖిల్ ప్రేమలో పడ్డారు. బుల్లితెర క్రేజీ కపుల్ గా వీరు అవతరించారు. ప్రతి ఈవెంట్లో కలిసి సందడి చేసేవారు.
ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వరుస వీడియోలు చేశారు. ఏమైందో తెలియదు సడన్ గా దూరమయ్యారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో కావ్యతో బ్రేకప్ లవ్ స్టోరీ రివీల్ చేశాడు. ఆరేళ్ళ ప్రేమ మాది. ఇప్పటికీ మేము విడిపోయామని నేను అనుకోవడం లేదు. హౌస్ నుండి బయటకు వెళ్ళాక, తనను కలుస్తాను. బ్రతిమిలాడుకుంటాను. క్షమించమని అడుగుతాను. ఎలాగైనా తిరిగి ఆమె ప్రేమను పొందుతాను, అన్నాడు.
కాగా నిఖిల్ కామెంట్స్ కి కావ్య ఇండైరెక్ట్ గా సెటైర్ వేసింది. నకిలీ మనుషులు పరిస్థితులకు తగ్గట్లు మారిపోతారనే అర్థంలో ఒక సోషల్ మీడియా కామెంట్ చేసింది. నిఖిల్ మీద ఆమె చాలా కోపంగా ఉన్నారని ఒకటి రెండు సందర్భాల్లో ఆమె చేసిన కామెంట్స్ తో రుజువైంది. ఈ క్రమంలో నిఖిల్ కి కావ్య మనసు మార్చడం పెద్ద టాస్క్. నిఖిల్ టైటిల్ విన్నర్ గా భారీ ఫేమ్ కొట్టేసిన సంగతి అటుంచి, తన మీద ఉన్న ప్రేమను బిగ్ బాస్ లో ఎన్నోసార్లు వ్యక్తం చేసినదాంట్లో ఉన్న నిజాయితీని గుర్తించి కావ్య మనసు కరుగుతుందేమో చూద్దాం !