https://oktelugu.com/

Perni Nani: అరెస్టు భయంతో సీనియర్ నేత కుటుంబం పరారీ

ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది. గతంలో దూకుడుగా వ్యవహరించిన నేతలను విడిచిపెట్టకూడదని భావిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా కేసులు నమోదు చేసేందుకు సిద్ధపడుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 16, 2024 / 10:36 AM IST

    Perni Nani

    Follow us on

    Perni Nani: వైసీపీలో లాజిక్ గా మాట్లాడిన నేతల్లో పేర్ని నాని ముందుంటారు.అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారం కోల్పోయినప్పుడు తన మాటల వేడితో ప్రత్యర్థులను టార్గెట్ చేసేవారు. మొన్నటి వరకు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. డిప్యూటీ సీఎం పవన్ కాకినాడ తీరానికి వెళ్లి పట్టుబడిన బియ్యం పరిశీలించినప్పుడు కూడా కొన్ని రకాల ప్రశ్నలు వేశారు. ఆ షిప్ వరకు మాత్రమే ఎందుకు వెళ్లారని.. దానికి కూతవేటు దూరంలో ఉన్న షిప్ లో భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరోపించారు నాని. ఆ బియ్యం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందినవని కూడా చెప్పుకొచ్చారు. అలా కామెంట్స్ చేసిన తరువాత పేర్ని నాని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం బయటకు కనిపించడం లేదు. కుటుంబ సభ్యులతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈనెల 13 న వైసిపి రాష్ట్రస్థాయి ఉద్యమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ నిరసన కార్యక్రమాల్లో సైతం పేర్ని నాని కనిపించలేదు.దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

    * ఆ కారణంతోనే
    రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం మాఫియా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ తరుణంలోనే పేర్ని నాని పేరు బయటకు వచ్చింది. నాని సతీమణి జయసుధ పేరిట మచిలీపట్నంలో కొన్ని గోదాములు ఉన్నాయి. వీటిని పౌర సరఫరాల శాఖ లీజుకు తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ బియ్యాన్ని ఈ గోదాములలో ఉంచారు. అయితే ఉన్నట్టుండి గోదాముల్లో భారీగా బియ్యం నిల్వలు పక్కదారి పట్టాయి. ప్రభుత్వం నిల్వ ఉంచిన బియ్యం లో ఏకంగా 3708 బస్తాల రేషన్ బియ్యం మాయం కావడం సంచలనం గా మారింది. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ తరుణంలోనే పేర్ని నాని కుటుంబం పరారీ అయినట్లు ప్రచారం నడుస్తోంది.

    * అధికార యంత్రాంగం సహకారం
    ప్రత్యర్థులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకునే పేర్ని నానిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.అయితే తన అరెస్టు ఉంటుందని భయపడిన పేర్ని నాని కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కృష్ణాజిల్లా యంత్రాంగం పేర్ని నానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసిపి హయాంలో నియమితులైన కొందరు అధికారులు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు అరెస్ట్ ఉంటుందని తెలుసుకున్న పేర్ని నాని న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై కూటమి ప్రభుత్వం సీరియస్ యాక్షన్కు దిగితే మాత్రం సహకరించే అధికారుల పేర్లు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి.