https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : టాస్కులలో విజృభించిన నిఖిల్..బిగ్ బాస్ చరిత్రలో అసలు సిసలు కంబ్యాక్ అంటే ఇదే!

నిఖిల్ నిన్న మొన్నటి వరకు ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయారు. ఎమోషనల్ గా ఇంత బలహీనంగా ఉన్నాడేంటి, అందరూ ఇతనితో ఇష్టమొచ్చినట్టు ఆడేసుకుంటున్నారు కదా, ఇలా ఉంటే టాప్ 5 కూడా కష్టం అని అనుకున్నారు. కానీ ఈరోజు ఆయన ఇచ్చిన కం బ్యాక్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : September 13, 2024 / 08:38 AM IST

    Bigg Boss Nikhil

    Follow us on

     

    Bigg Boss Telugu 8 :  బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవ్వబోతుంది అనగానే సోషల్ మీడియా లో కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ పేర్లలో మనకి మొదట వినిపించింది నిఖిల్ పేరు. హౌస్ లోకి అడుగుపెట్టకముందే ఇతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే అంచనాలు జనాల్లో విపరీతంగా ఉండేవి. ఆ అంచనాలతో హౌస్ లోకి అడుగుపెట్టిన ఈయన నిన్న మొన్నటి వరకు ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయారు. ఎమోషనల్ గా ఇంత బలహీనంగా ఉన్నాడేంటి, అందరూ ఇతనితో ఇష్టమొచ్చినట్టు ఆడేసుకుంటున్నారు కదా, ఇలా ఉంటే టాప్ 5 కూడా కష్టం అని అనుకున్నారు. కానీ ఈరోజు ఆయన ఇచ్చిన కం బ్యాక్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందరి క్లాన్స్ తో పోలిస్తే నిఖిల్ క్లాన్ చాలా చిన్నది, ఫిజికల్ గా కూడా నిఖిల్ క్లాన్ చాలా బలహీనమైనది. ఒక్క నిఖిల్ తప్ప బలంగా టాస్కులు ఆడవాళ్లు లేరు. మణికంఠ ఆడగలడు కానీ, బలమైన ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఓడిపోగలడు. అందుకే నేడు నిఖిల్ బరిలోకి దూకి టాస్కులు మొత్తం గెలిచాడు.

    ఇన్ఫినిటీ మనీ ని గెలుచుకునే టాస్కులో భాగంగా బిగ్ బాస్ ముందు నిఖిల్, నబీల్ మరియు పృథ్వీ రాజ్ కి రోప్ టాస్క్ ఇస్తాడు. తాడుని వదలకుండా ముగ్గురు పట్టుకొని, ఎవరికీ కేటాయించిన బాల్స్ ని వారి బాక్సులలో వేసుకోవాలి. ఎవరైతే తాడుని వదలకుండా చివరి వరకు ఎక్కువ బాల్స్ వేస్తారో, వాళ్ళు టాస్కులో విన్ అయ్యినట్టు. ఈ టాస్కులో ముగ్గురు బలంగానే ప్రారంభిస్తారు కానీ, నబీల్ కంట్రోల్ తప్పిపోయి మొదట తాడుని వదిలేస్తాడు. ఆ తర్వాత నిఖిల్, పృథ్వీ రాజ్ మధ్య ఘోరమైన పెనుగులాట జరుగుతుంది. పృథ్వీ నిఖిల్ బాల్స్ ని కళ్ళతో బలంగా కొట్టి దూరంగా పడేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు తాడుని లాగుకుంటూ చివరి దాకా వెళ్తారు. అలా వెళ్తూ చివరికి పృథ్వీ తాడుని వదిలేస్తాడు, నిఖిల్ తాడుని పట్టుకొని గేమ్ గెలుస్తాడు. ఆ తర్వాత కూడా ఆయన వరుసగా రెండు టాస్కులు గెలుస్తాడు, చివరి టాస్కు మాత్రం టై అవుతుంది. ఇద్దరికి చెరి సమానంగా ప్రైజ్ మనీ ని పంచుతారు.

    అలా ఏమి లేని స్థానం నుండి నిఖిల్ తన క్లాన్ కి 2 లక్షల 45 వేల రూపాయిల ప్రైజ్ మనీ ని తెచ్చిపెట్టాడు. ఎమోషనల్ గా వీక్ అయిపోయి, అసలు కోలుకుంటాడా లేదా అనే స్థాయికి వెళ్లిన నిఖిల్, ఈ స్థాయిలో కం బ్యాక్ ఇచ్చి తన అభిమానులను సంతృప్తి పరుస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రేపు కూడా టాస్కులు ఉన్నాయి, నిఖిల్ రేపు కూడా గెలిస్తే ఎదో క్లాన్ నుండి సభ్యులను తన క్లాన్ లోకి తీసుకునే అవకాశం బిగ్ బాస్ కల్పించొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుందో. న్యాయం గా టాస్కులు ఆడి బౌన్స్ బ్యాక్ అయిన నిఖిల్ ఇదే విధంగా తన ఆట ని కొనసాగిస్తే కచ్చితంగా టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయి.