Big Boss Telugu 8 : విష్ణు ప్రియా, నభీల్ లలో అన్యాయం ఎవరికి జరిగింది..? సంచాలక్ గా ప్రేరణ ఫెయిల్ అయ్యిందా!

ఒక బాక్స్ లోనే వీళ్లంతా ఆడాలి, బాక్స్ దాటితే టాస్కు నుండి అవుట్. ఇది గేమ్ యొక్క ముఖ్యమైన రూల్స్. సంచాలక్ కూడా రూల్స్ పెట్టొచ్చు, కానీ ప్రేరణ టాస్కు మధ్యలో రూల్స్ పెట్టింది. అప్పటికే ఇద్దరు అవుట్ అయిపోయి ఉన్నారు. టాస్కులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ చేతులు వెనక్కి పెట్టుకొని ఆడాలి, ఈ టాస్కులో విష్ణు ప్రియా పొరపాటున తగిలిన అభయ్ తలకు రిఫ్లెక్షన్ గా లైన్ దాటి క్రింద పడిపోతుంది.

Written By: Vicky, Updated On : September 13, 2024 8:47 am

Big Boss Telugu 8

Follow us on

Big Boss Telugu 8 : ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు చాలా రసవత్తరంగా సాగాయి. అదే సమయంలో వివాదాస్పదం గా కూడా మారాయి. ముఖ్యంగా సంచాలక్ గా వ్యవహరించిన వారికి చుక్కలు కనిపించాయని చెప్పొచ్చు. ముందుగా ప్రేరణ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈమెని నేడు చివరగా బిగ్ బాస్ పెట్టిన సాక్స్ టాస్క్ కి సంచాలక్ గా పెట్టుకున్నారు. ఈ టాస్కుని మూడు వైపుల నుండి చూడాలి. అలా చూసేందుకు ఒక సంచాలక్ కి వీలు పడదు. ఇద్దరు అసిస్టెంట్స్ ని ప్రేరణ పెట్టుకొని చివర్లో వాళ్లిద్దరూ చెప్పే దానిని బట్టి నిర్ణయం తీసుకొని ఉండుంటే బాగుండేది. అసలు టాస్కు ఏమిటంటే మూడు క్లాన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరుగా టాస్కులో పాల్గొంటారు. ఈ టాస్కులో సాక్సులు వేసుకోవాలి. చేతులు ఉపయోగించకుండా అవతలి వ్యక్తి సాక్సులను పీకేయాలి.

ఒక బాక్స్ లోనే వీళ్లంతా ఆడాలి, బాక్స్ దాటితే టాస్కు నుండి అవుట్. ఇది గేమ్ యొక్క ముఖ్యమైన రూల్స్. సంచాలక్ కూడా రూల్స్ పెట్టొచ్చు, కానీ ప్రేరణ టాస్కు మధ్యలో రూల్స్ పెట్టింది. అప్పటికే ఇద్దరు అవుట్ అయిపోయి ఉన్నారు. టాస్కులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ చేతులు వెనక్కి పెట్టుకొని ఆడాలి, ఈ టాస్కులో విష్ణు ప్రియా పొరపాటున తగిలిన అభయ్ తలకు రిఫ్లెక్షన్ గా లైన్ దాటి క్రింద పడిపోతుంది. అభయ్ తొయ్యడం వల్లనే నేను క్రిందకు పడిపోయాను అని అంటుంది విష్ణు. కాదు అని అభయ్ వాదిస్తాడు, కానీ నిజానికి అభయ్ తల తగిలే ఆమె క్రిందకు పడిపోయింది. ఇది ప్రేరణ చూసింది కాబట్టి విష్ణు ప్రియా కి ముందుగా అవుట్ ఇవ్వలేదు. కాణి ఆ తర్వాత కాసేపటికి విష్ణు ప్రియా గేమ్ ఆడుతూ క్రిందకి పడిపోతుంది. అప్పుడు ప్రేరణ అవుట్ ఇచ్చేస్తుంది, కానీ అందుకు విష్ణు ప్రియా ఒప్పుకోదు, అభయ్ లాక్ చెయ్యడం వల్లనే నేను అతనిని నెట్టేయాల్సి వచ్చింది అని వాదిస్తుంది, అందుకు ప్రేరణ ఒప్పుకోదు, బయటకి వెళ్ళమని గట్టిగా చెప్తుంది. ఇక చివరికి నబీల్, నిఖిల్ మరియు అభయ్ మిగులుతారు. ఇప్పుడు ప్రేరణ మరో కొత్త రూల్ పెడుతుంది. సాక్స్ ని కంటెస్టెంట్స్ అందరిని చివరికి లాగుకోమని చెప్తుంది, ఎవరైతే సాక్సుని కనపడకుండా దాచుకుంటారో వాళ్ళు అవుట్ అని చెప్తుంది.

నబీల్ కావాలని దాచుకోదు కానీ, నడుస్తున్నప్పుడు పొరపాటున ఆ సాక్స్ వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళింది కాబట్టి నబీల్ అవుట్ అని ప్రేరణ అంటుంది. ఇందుకు నబీల్ ఒప్పుకోడు, ఇద్దరి మధ్య వాగ్వివాదం చాలా సేపటి వరకు జరుగుతుంది. చివరికి సంచలక్ నిర్ణయమే తుది నిర్ణయం అని బిగ్ బాస్ ప్రకటించడం తో నబీల్ వెనక్కి వెళ్తాడు. ఈ విషయం లో ప్రేరణ సంచాలక్ గా ఫెయిల్ అయ్యింది అని చెప్పొచ్చు. నబీల్ కి ఒక అవకాశం ఇచ్చింది. ఇక చివర్లో నిఖిల్ మరియు అభయ్ మిగులుతారు, బజర్ మోగే సమయానికి ఇద్దరికీ సాక్సులు ఉండడం తో గేమ్ ని టై చేస్తారు.