https://oktelugu.com/

Committee Kurrallu Movie Collections ;  లాభాలే లాభాలు..నిర్మాతగా కుంభస్థలం బద్దలు కొట్టిన నిహారిక..’కమిటీ కుర్రాళ్ళు’ 10 రోజుల వసూళ్లు ఎంతంటే!

రీసెంట్ గా నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రాళ్ళు' అనే చిత్రం పెట్టిన ప్రతీ పైసాకి పదింతలు ఎక్కువ రాబడిని రాబట్టింది. ఎలాంటి హంగామా లేకుండా, అతి చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 09:20 PM IST

    Committee Kurrallu Movie Collections

    Follow us on

    Committee Kurrallu Movie Collections : సక్సెస్ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూసే ఒక మనిషికి, ఒక్కసారిగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టే రేంజ్ సక్సెస్ వస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో మాటల్లో చెప్పలేము. ప్రస్తుతం నిహారిక కొణిదెల అలాంటి అనుభూతిని ఆస్వాదిస్తోంది. మెగా బ్రదర్ నాగ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఆమెకి ఒక్క సక్సెస్ కూడా రాలేదు. ఇక మనకి నటన కలిసిరాదేమో అనే ఉద్దేశ్యంతో ఆమె నటనకి దూరమై తన తండ్రిలాగా నిర్మాతగా స్థిరపడాలని అనుకుంది. అలా ఆమె నిర్మాతగా మారి వెబ్ సిరీస్లను నిర్మించడం మొదలు పెట్టింది. కానీ అవి ఆమెకి ఏమాత్రం సక్సెస్ ని ఇవ్వలేదు.

    కానీ రీసెంట్ గా ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రం పెట్టిన ప్రతీ పైసాకి పదింతలు ఎక్కువ రాబడిని రాబట్టింది. ఎలాంటి హంగామా లేకుండా, అతి చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలా ప్రీమియర్స్ + మొదటి రోజు వసూళ్లతో కలిపి కేవలం 70 లక్షల రూపాయిల షేర్ ఓపెనింగ్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ మొదలైంది. ఆ తర్వాత రెండవ రోజు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మూడవ రోజు కోటీ 20 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఆ తర్వాత నాల్గవ రోజు 70 లక్షలు, ఐదవ రోజు 55 లక్షలు, ఆరవ రోజు 50 లక్షలు, ఏడవ రోజు 40 లక్షలు, 8 వ రోజున 35 లక్షలు, 9 వ రోజున 52 లక్షలు, 10 వ రోజున 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈ చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి వారం రోజుల్లో 6 కోట్ల 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

    ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ చిత్రానికి పది రోజులకు గానూ 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం మూడు కోట్ల రూపాయలకు జరగగా, కేవలం పది రోజుల్లోనే నాలుగు కోట్ల రూపాయిల లాభం వచ్చింది. ఇప్పటికీ కూడా కలెక్షన్స్ స్టడీ గా ఉండడంతో ఫుల్ రన్ లో ఈ చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు సాదిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇవి కాకుండా ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ తో కలిపి నిహారికకు అదనంగా మరో 30 కోట్ల రూపాయిల లాభం వచ్చి ఉంటుంది. అలా ఈమె కేవలం మూడు కోట్ల రూపాయలతో 40 కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించి కుంభస్థలం బద్దలు కొట్టింది. భవిష్యత్తులో నిర్మాతగా నిహారిక ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.