https://oktelugu.com/

Impress the Wife : భార్యను ఆకట్టుకోవాలంటే ఈ పనులు చేయండి..

భర్త లాగా భార్య ఉద్యోగం, వ్యాపారం చేయలేకపోవచ్చు. కానీ గృహిణిగా అంతకంటే ఎక్కువే కష్టపడుతుంది. అందువల్ల భార్యభర్తలు ఇద్దరూ సమానమే అని భావించాలి. భార్యతో గౌరవంగా ఉండడం వల్ల ఆమె మనసు ఎంతో సంతోష పడుతుంది.భార్య చేసే కొన్నిపనులను మెచ్చుకోవడం వల్ల ఆమెలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 19, 2024 3:03 pm
    Impress the Wife

    Impress the Wife

    Follow us on

    Impress the Wife : ప్రతీ వ్యక్తికి ఒకే ఒక జీవితం ఉంటుందని అంటారు.కానీ పెళ్లి ముందు.. పెళ్లయిన తరువాత జీవితం వేరేలా ఉంటుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేముందు ఒకరి లైఫ్ లోకి మరొకరి వచ్చి ఇద్దరు కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎన్నో సంతోషాలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే భార్యభర్తలు సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అలాగే దంపతులిద్దరు కలకాలం కలిసి ఉండాలంటే ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకోవాలి. కానీ అన్ని సమయాలు ఒకేలా ఉండవు. అలాగే అన్నీ వేళల్లో సంతోషం కావాలంటే కుదరదు. పెళ్లయిన కొత్తలో జీవితం బాగానే ఉంటుంది. కానీ ఆ తరువాత ఒకరిపై ఒకరికి కోపం పెరుగుతుంది. ఆ తరువాత అసహనం పెరుగుతుంది. ఇలాంటి సందర్బంలో ఒక్కోసారి గొడవలు కూడా జరుగుతాయి. ఇవి దంపతుల మధ్య దూరాన్ని పెంచుతుంది. అయితే భార్య కంటే భర్త పెద్ద మనసు చేసుకొని తన జీవిత భాగస్వామిని చేరదీయాలి. అంతేకాకుండా భార్యను అర్థం చేసుకోసుని వారితో కొన్ని పనులు చేయడం వల్ల ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇంతకీ ఏం చేయాలి?

    భర్త లాగా భార్య ఉద్యోగం, వ్యాపారం చేయలేకపోవచ్చు. కానీ గృహిణిగా అంతకంటే ఎక్కువే కష్టపడుతుంది. అందువల్ల భార్యభర్తలు ఇద్దరూ సమానమే అని భావించాలి. భార్యతో గౌరవంగా ఉండడం వల్ల ఆమె మనసు ఎంతో సంతోష పడుతుంది.భార్య చేసే కొన్నిపనులను మెచ్చుకోవడం వల్ల ఆమెలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆమె పుట్టిన రోజు విలువైన బహుతులు ఇచ్చి సంతోష పరచాలి.

    తల్లిదండ్రుల తో కంటే స్నేహితులతో ఎక్కువగా సంతోషంగా ఉంటారు కొందరు. అలాగే కుటుంబ సభ్యులతో పంచుకోలేని విషయాలో ఫ్రెండ్స్ కు చెబుతూ ఉంటాం. అలాగే భార్యతో ఒక స్నేహితుడిలా ఉండాలి. భార్యకు మంచి ఫ్రెండ్ గా ఉండడం వల్ల ఆమె తన మనసులోని విషయాలను భర్తతో షేర్ చేసుకుంటుంది. ఒక స్నేహితుడు అయితే ఎలా ఉంటారో అలాగే ప్రవర్తించాలి. సరదాగా కబుర్లు చెబుతూ ఉండాలి. విహార యాత్రలకు తీసుకెళ్లి సంతోషంగా ఉండాలి.

    ఒక భర్త నుంచి భార్యకోరుకునేది రక్షణ. చిన్నప్పుడు తండ్రి సమక్షంలో ఉన్న ఆమె ఆ తరువాత భర్త సంరక్షణలో ఉంటుంది. ఇలాంటప్పుడు ఆమెకు రక్షణగా ఉన్నామనే భావనతో ఉండాలి.భార్యకు రక్షణగా ఉండే పనులు చేయాలి. ఆమెకు ఆపద వస్తే వెన్నంటే ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో పనులు కూడా చేయలేకపోతారు. అలాంటి సందర్భంలో ఆమెకు సాయం చేయడం వల్ల భర్తపై నమ్మకం ఏర్పడుతుంది.

    వైవాహిక జీవితంలో భార్య భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఇదే సమమయంలో శారీరకంగా భర్తతో షేర్ చేసుకోవాలనుకుంటుంది. ఈ విషయంలో ఆమెను సంతోష పెట్టడం ద్వారా ఆమె ఎప్పటికీ భర్తను విడిచిపెట్టదు. అందువల్ల శారీరక సంతృప్తి ఇస్తూ వారిని ఆనందంగా ఉంచాలి. ఇంట్లో ఉన్నంత సేపు చిన్న చిన్న రొమాన్స్ ఫనులు చేయడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. దీంతో ఒకరిపై ఒకరికి నమ్మకంపెరుగుతుంది.