
నిన్నామొన్నటి వరకు నవ్వుతూ, నవ్విస్తూ కనిపించిన మెగా డాటర్ నిహారిక.. గాయంతో బెడ్ కే పరిమితమైపోయింది. నిత్యం.. సోషల్ మీడియాలో హ్యాపీ మూడ్స్ ను షేర్ చేసే నిహారిక.. ఇప్పుడు ఉన్నట్టుండి తనకు గాయమైన ఫొటో పోస్ట్ చేయడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందా? అని ఆరాతీయడం మొదలు పెట్టారు.
Also Read: బన్నీ-స్నేహా.. టెన్త్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్.. తాజ్ మహల్ ఎదుట చుంబన సంబరాలు!
తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో ఓ ఫొటో పోస్ట్ చేసింది నిహారిక. అందులో ఆమె కాలుకు కట్టిఉంది. అది ఫ్రాక్చర్ అయినప్పుడు వేసే సిమెంట్ పట్టీలాగా కనిపిస్తోంది. దీంతో.. ఆమెకు బలమైన గాయమే అయ్యిందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ ఫొటోలో కేవలం ఆమె కాలు వరకు మాత్రమే ఉంది. ఎదురుగా భర్త చైతన్య ఫోన్లో ఏదో చూస్తూ కనిపిస్తున్నాడు.
Also Read: RRR మూవీ బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ కళ్లు పీకేస్తాడట.. రామ్ చరణ్ కాళ్లు తీసేస్తాడట!
ఆమె కుడికాలికి గాయమైంది. బెడ్ మీద కాలు చాచి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. డాక్టర్ ను కన్సల్ట్ అయిన ఫైల్ కూడా చూపుతోందీ ఫొటో. ఈ ఫొటో చూస్తే నిహారిక నడవలేని స్థితిలో ఉందని, పెద్ద దెబ్బే తగిలిందని కన్ఫామ్ అవుతోంది. కానీ.. అది ఎంత పెద్దది? అసలు ఎలా తగిలింది? అన్న విషయాలను మాత్రం షేర్ చేయలేదు నిహారిక.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఆమె గాయపడడంతో.. భర్త చైతన్య సపర్యలు చేస్తున్నాడు. భార్య నడవలేని స్థితిలో ఉండడంతో దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. కాగా.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తోంది. మరి, ఇప్పుడు నిహారిక గాయపడింది కాబట్టి.. ఈ సిరీస్ షూట్ పై గట్టిగానే ప్రభావం పడేట్టు కనిపిస్తోంది.