టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎన్నో జంటలు ఉన్నప్పటికీ.. కొందరు మాత్రం ఎప్పటికీ స్పెషల్ గా ఉంటారు. అలాంటి వారిలో అల్లుఅర్జున్-స్నేహ జంట ముందు వరసలో ఉంటుంది. వారి వివాహ బంధానికి మార్చి 6వ తేదీతో పదేళ్లు నిండాయి. ప్రతీఏడాది మ్యారేజ్ డే అంటేనే అదో అందమైన ఫీలింగ్. అలాంటిది.. పదేళ్ల మైలురాయిని చేరుకున్నప్పుడు ఆ సంతోషం డబుల్ డోస్ అవుతుందనడంలో సందేహం లేదు.
Also Read: RRR మూవీ బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ కళ్లు పీకేస్తాడట.. రామ్ చరణ్ కాళ్లు తీసేస్తాడట!
ఈ ఆనంద సమయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారీ దంపతులు. ఈ సందర్భంగా భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. సతీమణిని తీసుకొని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఈ జోడీ.. అద్భుతమైన ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: కలెక్షన్ల ‘ఉప్పెన’.. 100 కోట్ల పోస్టర్ వదిలారుగా!
ఈ పిక్స్ ను స్వయంగా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు స్నేహ. అంతేకాదు.. అద్భుతమైన కామెంట్ కూడా జతచేశారు. ‘‘నువ్వు పక్కనుంటే డల్ మూమెంట్ అనేదే కనిపించదు. మీరు ఊహించనదాన్ని మించి ప్రేమిస్తున్నా’’ అని బన్నీపై తన ప్రేమను తెలియజేసింది స్నేహ.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
అంతేకాదు.. బ్యాక్ గ్రౌండ్ లో ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ కనిపిస్తుండగా.. ముందు ఈ జంట ప్రేమలో మునిగిపోయింది. ఈ దంపతులిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. ఈ పిక్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. మీరిద్దరూ మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్ చేస్తున్నారు.