కోటీశ్వరుల ప్రోమో రిలీజ్.. ఎన్టీఆర్ కనిపించాడు.. కానీ కనిపించట్లేదు..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జెమినీ టీవీ ఓ షో ప్లాన్ చేస్తోంద‌న్న విష‌యం తెలిసిందే. అది ఒక‌ప్పుడు మాటీ‌లో ఫేమ‌స్ షో అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అన్న సంగతి కూడా చాలా మందికి తెలిసిందే. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. త్వరలోనే ఆరంభం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మారిన పేరుతో, లోగోతో, హోస్ట్ గో స‌రికొత్త‌గా రాబోతోందీ ప్రోగ్రాం. 30 సెకన్ల నిడివి కలిగిన ఈ ప్రోమోను ఆకర్షణీయంగా […]

Written By: Bhaskar, Updated On : March 7, 2021 3:59 pm
Follow us on


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జెమినీ టీవీ ఓ షో ప్లాన్ చేస్తోంద‌న్న విష‌యం తెలిసిందే. అది ఒక‌ప్పుడు మాటీ‌లో ఫేమ‌స్ షో అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అన్న సంగతి కూడా చాలా మందికి తెలిసిందే. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. త్వరలోనే ఆరంభం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మారిన పేరుతో, లోగోతో, హోస్ట్ గో స‌రికొత్త‌గా రాబోతోందీ ప్రోగ్రాం.

30 సెకన్ల నిడివి కలిగిన ఈ ప్రోమోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో విజయవంతమైన షో.. సామాన్యుల జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలను నిజం చేసేందుకు.. మీ జెమిని టివిలో రాబోతోంది’’ అంటూ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత ఓ పెద్ద తార ఆకాశం నుంచి దూసుకొచ్చి బాంబులా నేలను ఢీకొట్టడంతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అన్న లోగో ఆవిష్కృత‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత లోగో ప‌క్క‌నే షాడోలో ఓ చైర్ ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌గా.. హోస్ట్ వ‌చ్చి అందులో కూర్చున్నాడు.

Also Read: బ‌న్నీ-స్నేహా.. టెన్త్ మ్యారేజ్ డే సెల‌బ్రేష‌న్స్‌.. తాజ్ మ‌హ‌ల్‌ ఎదుట చుంబ‌న సంబ‌రాలు!

అయితే.. ఈ షో చేయ‌బోతున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. అయిన‌ప్ప‌టికీ.. జూనియ‌ర్ పేరును రివీల్ చేయ‌లేదు చాన‌ల్‌. కానీ.. ప్రోమో ఎండింగ్ లో హోస్ట్ సీట్లో కూర్చున్న‌ది మాత్రం ఎన్టీఆర్ అన్న విష‌యం అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. త్రివిక్ర‌మ్ ఈ ప్రోమోను డిజైన్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

Also Read: RRR మూవీ బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ క‌ళ్లు పీకేస్తాడ‌‌ట‌.. రామ్ చ‌ర‌ణ్ కాళ్లు తీసేస్తాడ‌‌ట‌!

కాగా.. ఈ షో మార్చి చివ‌రి వారం నుంచి లేదా.. ఏప్రిల్ మొద‌టి వారం నుంచి ప్రారంభం కాబోతోంద‌ని స‌మాచారం. ఈ షో వారంలో ఐదు రోజులు ప్ర‌సారం అవుతుందని తెలుస్తోంది. ఆదివారం నుంచి గురువారం వ‌ర‌కు ప్లే చేస్తార‌ని టాక్‌. మొత్తం 60 ఎపిసోడ్లు కొన‌సాగుతుంద‌ట‌. రాత్రి 9 గంట‌ల నుంచి 10.30 గంట‌ల పాటు ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ షో ప్రసారం కానుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

మొదటి ఎపిసోడ్ కు పెద్ద స్టార్ ను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా.. ప్రతీ ఆదివారం స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఉంటుందట. మరి, బిగ్ బాస్ లో తన యాంకరింగ్ తో అలరించిన జూనియర్.. ఈ షోను ఎలా హ్యాండిల్ చేస్తాడోననే ఆసక్తి నెలకొంది.