https://oktelugu.com/

ఆగలేకపోతున్నా.. సమ్మర్ ముందే వచ్చేయవా – నిహారిక

నిహారిక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయింది. వెంట వెంటనే పోస్టులు కూడా పెడుతుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తోంది. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది. అప్పటి వరకు ఆగలేకపోతున్నా.. సమ్మర్ ముందే వచ్చేయవా అంటూ ఓ కామెంట్ పెట్టింది. మొన్నే పెళ్లైంది కదా.. ఎందుకు ఇలాంటి కామెంట్ పెట్టింది అనుకుంటున్నారా.. నిహారిక సమ్మర్ కోసం చూస్తుంది సినిమా కోసమట. చిరంజీవి నటిస్తున్న ఆచార్య టీజర్ నిన్న విడుదలైంది. టీజర్ లో చిరు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 30, 2021 / 03:31 PM IST
    Follow us on


    నిహారిక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిపోయింది. వెంట వెంటనే పోస్టులు కూడా పెడుతుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తోంది. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది. అప్పటి వరకు ఆగలేకపోతున్నా.. సమ్మర్ ముందే వచ్చేయవా అంటూ ఓ కామెంట్ పెట్టింది. మొన్నే పెళ్లైంది కదా.. ఎందుకు ఇలాంటి కామెంట్ పెట్టింది అనుకుంటున్నారా.. నిహారిక సమ్మర్ కోసం చూస్తుంది సినిమా కోసమట. చిరంజీవి నటిస్తున్న ఆచార్య టీజర్ నిన్న విడుదలైంది. టీజర్ లో చిరు యాక్షన్ చూసి ఫిదా అయిపోయినా నిహారిక ఇలాంటి పోస్ట్ ను పెట్టింది.

    Also Read: రిలీజ్ కు ముందే 24 కోట్లు లాభం !

    నిహారిక మాటల్లోనే ‘డాడీ.. నువ్వేంటి ఇలా ఉన్నావ్.. మీ యాక్షన్ అదిరిపోయింది.. ఈ టీజర్ చూసిన తర్వాత కూడా మేం సమ్మర్ వరకు ఆగాలా.. అప్పటి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు.. ఈ సమ్మర్ ఏదో త్వరగా వచ్చుంటే బాగుండు’ అంటూ నిహారిక ట్వీట్ చేసింది. కాగా నిహారిక చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ నిహారికను సపోర్ట్ చేస్తూ మేం కూడా ఆగలేకపోతున్నాం, అన్నయ్య సినిమాని త్వరగా చూడ్డానికి సమ్మర్ కాస్త ముందుకొచ్చుంటే బాగుండు అంటూ వాళ్లు కూడా నిహారిక చేసిన ట్వీట్ కింద కామెంట్స్ పెడుతున్నారు.

    Also Read: మెగాస్టార్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన కొరటాల !

    ఏది ఏమైనా 65 ఏళ్ల వయసులో మెగాస్టార్ ఎనర్జీ మాములుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. నిజానికి కొరటాల కథలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్నట్టు వంశీ పైడిపల్లి చిరు కోసం స్టోరీ లైన్ ను డెవలప్ చేస్తున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్.