‘సంక్రాంతి’కే మహేష్ బాబు.. ముఖం దాచేస్తున్నారు!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ముఖమే అందం.. ఆయన అంత అందంగా దేశంలో ఏ హీరో ఉండడు. అలాంటి అందగాడి ముఖాన్ని దాచేస్తూ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ‘సర్కారు వారి పాట’ టీం. దర్శకుడు పరుశురామ్ ఎందుకోగానీ మహేష్ బాబును దాచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ లాక్ అయిపోయాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ దసరకు వస్తుండగా.. చిరంజీవి వేసవికి.. ఆ మధ్యలో పుష్ప ఇతర సినిమాలు అనౌన్స్ చేసేశారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆ లైన్లోకి […]

Written By: NARESH, Updated On : January 30, 2021 3:59 pm
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ముఖమే అందం.. ఆయన అంత అందంగా దేశంలో ఏ హీరో ఉండడు. అలాంటి అందగాడి ముఖాన్ని దాచేస్తూ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ‘సర్కారు వారి పాట’ టీం. దర్శకుడు పరుశురామ్ ఎందుకోగానీ మహేష్ బాబును దాచేస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ లాక్ అయిపోయాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ దసరకు వస్తుండగా.. చిరంజీవి వేసవికి.. ఆ మధ్యలో పుష్ప ఇతర సినిమాలు అనౌన్స్ చేసేశారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆ లైన్లోకి వచ్చేశాడు.

తాజాగా ‘సర్కారువారి పాట’ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు మహేష్ బాబు అండ్ టీం ప్రకటించింది. ఈ మేరకు ఒక ఆసక్తికర ఫొటోను కూడా షేర్ చేసింది.

ఒక భారీ తాళాల గుత్తిని పట్టుకున్న మహేష్ బాబు చేతిని మాత్రమే ఇందులో చూపించారు. ఇదివరకు పోస్టర్ లో మహేష్ చెవి రింగును చూపించగా.. అంతకుముందు మహేష్ కాయిన్ ఎగురవేస్తున్న చిత్రాన్ని చూపించారు. దీన్ని బట్టి మహేష్ లుక్ ను దాచేసి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.