https://oktelugu.com/

రిలీజ్ కు ముందే 24 కోట్లు లాభం !

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2’ 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ తీస్తున్నారు మేకర్స్. కాగా ‘ఎఫ్ 3’ కోసం ఇండస్ట్రీలోని చాలామంది నటీనటులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 30, 2021 / 03:19 PM IST
    Follow us on


    విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2’ 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ తీస్తున్నారు మేకర్స్. కాగా ‘ఎఫ్ 3’ కోసం ఇండస్ట్రీలోని చాలామంది నటీనటులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

    Also Read: ప్రదీప్ లెక్కలు చూసి సినీ పెద్దలే షాక్ !

    కాగా ‘ఎఫ్ 3’ మూవీ డిజిటల్ రైట్స్ 12 కోట్ల రూపాయలకు, శాటిలైట్ రైట్స్ కూడా 12 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. దీంతో రిలీజ్ కు ముందే 24 కోట్ల రూపాయల మేర ఈ సినిమా ఆర్జించినట్టయింది. నిజంగా ఈ రేంజ్ లో ఎఫ్ 3 కి మార్కెట్ అయింది అంటే.. నిజంగా అది గొప్ప విషయమే. ఎలాగూ దిల్ రాజు ఈ సినిమాలో నటిస్తోన్న నటీనటులకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్స్ ను ఇస్తున్నాడు. ఇంతకీ దిల్ రాజు ఏవరికి ఎంతెంత ఇస్తున్నాడు అంటే.. వెంకటేష్ కి పదకుండు కోట్లు, వరుణ్ తేజ్ కు ఎనిమిది కోట్లు, తమన్నాకు రెండు కోట్లు ఇలా భారీగానే ఇస్తున్నాడు.

    Also Read: సమంత -నాగ చైతన్యల మధ్య ఎందుకంత తేడా ?

    కాబట్టి, కచ్చితంగా ఈ సినిమాకి భారీగా మార్కెట్ అవ్వాలి. ఇక ఈ సినిమా కోసం చాలామంది కమెడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తమకు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ దొరుకుతుందని. ఎలాగూ ఈ సినిమాలో లెక్కకు మించిన కామెడీ పాత్రలు ఉన్నాయి కాబట్టి.. వాటిల్లో చిన్నాచితకా పాత్రలకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి.. అందరూ ఇప్పుడు అనిల్ రావిపూడి చుట్టూ తిరుగుతున్నారట ఒక క్యారెక్టర్ ఇవ్వమని. కానీ ఈ సినిమా కోసం దిల్ రాజు భారీగా రెమ్యూరేషన్లు ఇవ్వటమే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా టెక్నీషియన్లకు భారీగానే రెమ్యూనిరేషన్లను ఇస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్