https://oktelugu.com/

Pushpa 2 Movie : పుష్ప 2′ చిత్రంలో ఈ సన్నివేశాలన్నీ ఏమయ్యాయి..? స్టోరీ మొత్తాన్ని మధ్యలో మార్చేశారా? లేదా దాచిపెట్టారా!

'పుష్ప 2' చిత్రంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి టార్చర్ చేసారని, ఆ తర్వాత ఆయన ఒక రోజు తిరుపతి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని శేషాచలం అడవుల్లోకి పారిపోయాడని, అతని ఆచూకీ కోసం ఒకరోజు పోలీసులు శేషాచలం అడవి మొత్తాన్ని జల్లెడేయడానికి వెళ్లారని గ్లిమ్స్ వీడియో లో చూపించారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 5, 2024 / 09:31 PM IST

    Pushpa 2 Movie

    Follow us on

    Pushpa 2 Movie :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2 : ది రూల్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ, అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రేంజ్ ఓపెనింగ్స్ ని దక్కించుకొని ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. ఈ గ్లిమ్స్ వీడియో లో చూపించినట్టు సినిమా ఇసుమంత కూడా లేకపోవడం ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గ్లిమ్స్ వీడియోలో ఏముందంటే ‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి టార్చర్ చేసారని, ఆ తర్వాత ఆయన ఒక రోజు తిరుపతి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని శేషాచలం అడవుల్లోకి పారిపోయాడని, అతని ఆచూకీ కోసం ఒకరోజు పోలీసులు శేషాచలం అడవి మొత్తాన్ని జల్లెడేయడానికి వెళ్లారని గ్లిమ్స్ వీడియో లో చూపించారు.

    అలా పుష్ప ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్లిన పోలీసులకు అతని చొక్కా దొరుకుతుందని, ఆ చొక్కా ని చూస్తే తూటాలా గుర్తులు ఉన్నాయని మీడియా రిపోర్టర్ ఇదంతా చెప్తున్నట్టుగా చూపిస్తారు. ఇంతకు పుష్ప బ్రతికి ఉన్నట్టా?, లేనట్టా? ఉంటే ఎక్కడ ఉన్నాడు అనే విధంగా గ్లిమ్స్ కి ‘వేర్ ఈజ్ పుష్ప’ అని టైటిల్ పెట్టి విడుదల చేసారు. అంతే కాదు ఈ గ్లిమ్స్ వీడియో లో పుష్ప పేదల పాలిట దేవుడని, ఎర్ర చందనం అమ్మి వచ్చిన డబ్బులను ఆయన పేద ప్రజలకు పంచి పెట్టాడని, అతని రాక కోసం జనాలు మొత్తం ఎదురు చూస్తున్నట్టుగా చూపించారు. అలాంటి సమయంలో మీడియా లో పుష్ప ఆచూకీ దొరికిందని, చిరుత పులి ఎదుట నిలబడి తగ్గేదేలే మ్యానరిజం చేస్తూ గ్లిమ్స్ చివర్లో కనిపిస్తాడు అల్లు అర్జున్.

    అయితే గ్లిమ్స్ లో చూపించిన ఈ సన్నివేశాలన్నీ ఏమయ్యాయి?, మధ్యలో డైరెక్టర్ సుకుమార్ కథ నచ్చక స్టోరీ మొత్తాన్ని మార్చేశాడా?, లేకపోతే ఇదంతా పార్ట్ 3 కోసం దాచిపెట్టాడా అనేది ఆడియన్స్ కి అర్థం కాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఇదంతా పార్ట్ 3 లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సినిమా చివర్లో అల్లు అర్జున్ మరియు అతని కుటుంబం మొత్తం సవతి కొడుకు(అజయ్) కూతురి పెళ్ళికి వెళ్తారు. అప్పుడు దూరం నుండి ఒక వ్యక్తి బాంబు బట్టన్ ని నొక్కి పుష్ప కుటుంబం మొత్తాన్ని చంపేస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది పుష్ప పార్ట్ 3 లో చూపిస్తారని, మనకి మొదట్లో విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కథ ఇందులోనే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో డైరెక్టర్ సుకుమార్ మాత్రమే తెలిచేయాలి. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తన పూర్తి ఫోకస్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం పెట్టబోతున్నాడు.