YS Jagan Mohan Reddy : వైఎస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) కుటుంబ ఆస్తుల వివాదం పెను ప్రకంపనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కుమార్తె షర్మిల వైపు విజయమ్మ నిలిచారు. ఇటీవల సరస్వతి పవర్ వాటాల విషయంలో స్పష్టత ఇచ్చారు. జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అయితే దీనిపై తాజాగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి. తన తల్లి, సోదరి షర్మిల తో ఆస్తుల వివాదంపై అనేక విషయాలను బయటపెట్టారు. ఇంతటి వివాదానికి కారణం షర్మిల అని వ్యాఖ్యానించారు. షర్మిల అత్యాశతోనే సమస్యలు వస్తున్నాయని వివరించారు. కోర్టు కేసుల దృష్ట్యా వాటాలు అమ్మ పేరిట ఉంచితే.. గిఫ్ట్ డీడ్ లను అడ్డుపెట్టుకొని షర్మిల కాజేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. అందుకే షర్మిలపై ఒకప్పటి ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవని చెప్పుకొచ్చారు జగన్.
Also Read : వారి రాజీనామాలకు ఆరు నెలలు.. వైసిపి వ్యూహం.. గాల్లో ఎమ్మెల్సీలు!
గత కొద్దిరోజులుగా సరస్వతీ పవర్( Saraswati power ) వాటాల బదలాయింపు వ్యవహారంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ఎన్సిఎల్టిలో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వాటాల విషయంలో తల్లి విజయమ్మను ముందు ఉంచి షర్మిల వెనుక వ్యవహారం మొత్తం నడిపిస్తోందని చెప్పుకొచ్చారు. షర్మిల తన పంతం నెగ్గించుకోవడానికి అక్రమ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వాటాల వివాదంలో తల్లి విజయమ్మ ఆవేదనను అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. తన తల్లి పై గౌరవం ఉందని.. కానీ ఆమె వెనుక ఉండి చెల్లి చేయిస్తున్న అక్రమాలు అడ్డుకోవడానికి పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.
* షర్మిల తీరుతో నష్టం
షర్మిల( Sharmila) తీరు తో తనకు చాలా నష్టం జరిగిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత రాజకీయ, విభేదాలతో తల్లిని అడ్డం పెట్టుకుని వాటాలను బదలాయించడం వల్ల తనకు నష్టం వాటిల్లిందని జగన్ వివరించారు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని.. చేయి దాటకుండా ఉండేందుకు తనతో పాటు భారతి అమ్మ విజయమ్మ ద్వారా ప్రయత్నాలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కానీ అవేవీ ఫలించలేదని చెప్పుకొచ్చారు. అందుకే కోర్టుకు ఆశ్రయించవలసి వచ్చిందని చెప్పారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలో భాగస్వామ్యం కాలేదని వివరించారు.
* ఆమె బలి పశువు
తన తల్లి విజయమ్మను( vijayama ) షర్మిల బలి పశువు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. మా వాటాలను అక్రమంగా లాక్కోవడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారని అఫిడవిట్ లో పేర్కొన్నారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద రిజిస్టర్లో పేర్లను మార్చినప్పుడు.. సరైన కారణం ఉంటే జోక్యం చేసుకునే పరిధి ట్రిబ్యునల్ కు ఉంటుందని ఆ పిటిషన్ లో స్పష్టం చేశారు.
* అందుకే పిటీషన్ దాఖలు
ఒక పథకం ప్రకారం తన తల్లి విజయమ్మను షర్మిల తెరపైకి తెచ్చారని జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదని… వాటాల సర్టిఫికెట్లను తల్లి విజయమ్మకు అందజేయలేదని చెప్పారు. చెల్లితో ఉన్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామనడం అవాస్తవమని జగన్ పేర్కొన్నారు. కేవలం న్యాయబద్ధంగా తమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికైతే తన తల్లి ద్వారా షర్మిల బ్లాక్మెయిల్ చేస్తున్నారని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు జగన్. మరి వారి వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.
Also Read: పవన్ ను తిడితే ఎలా.. నష్టమని తెలిసినా ఎందుకలా జగన్!