https://oktelugu.com/

Niharika Konidela: ఆకును అడ్డుగా పెట్టి అలా కవ్వించిన నిహారిక… మెగా డాటర్ గ్లామరస్ లుక్ వైరల్!

ఒకటి రెండు తమిళ చిత్రాలు చేసిన నిహారిక 2020 డిసెంబర్ నెలలో వివాహం చేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక-వెంకట చైతన్య జొన్నలగడ్డ వివాహం ఘనంగా జరిగింది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 24, 2024 / 08:03 AM IST

    Niharika Konidela

    Follow us on

    Niharika Konidela: నిహారిక కొణిదెల ఒక మనసు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. నిహారిక ఎంట్రీ పై మెగా ఫ్యాన్స్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆమె హీరోయిన్ కావడానికి వీల్లేదన్నారు. పట్టుబట్టి నిహారిక హీరోయిన్ అయ్యింది. ఒక మనసు మూవీ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరోయిన్ చనిపోతుంది. ట్రాజిక్ ఎండింగ్స్ తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరు. అందుకేనేమో ఒక మనసు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో నటించింది. అవి కూడా నిరాశపరిచాయి.

    ఒకటి రెండు తమిళ చిత్రాలు చేసిన నిహారిక 2020 డిసెంబర్ నెలలో వివాహం చేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక-వెంకట చైతన్య జొన్నలగడ్డ వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగా హీరోలందరూ హాజరయ్యారు. దాంతో నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. కాగా రెండేళ్లు నిహారిక-వెంకట చైతన్య కలిసి ఉన్నారు. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. గత ఏడాది ప్రారంభంలో నిహారిక అధికారికంగా విడాకులు ప్రకటించింది.

    ప్రస్తుతం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె నటిగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఇది హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇటీవల ఒక తమిళ చిత్రానికి నిహారిక సైన్ చేసింది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం. మరి నటిగా రాణించాలంటే గ్లామరస్ ఫోటో షూట్స్ తప్పనిసరి. నిహారిక అదే చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోసం ఆమె ట్రై చేస్తుంది.

    తాజాగా ఆకు అడ్డుగా పెట్టి కవ్విస్తూ ఓ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు నిహారిక హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసింది. పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బడ్జెట్ చిత్రాలు, సిరీస్లు నిర్మించాలని ఆమె భావిస్తున్నారు. యువ రచయితలు, దర్శకులతో చర్చలు జరుపుతుంది. మొత్తంగా చిత్ర పరిశ్రమలోనే తన కెరీర్ ని వెతుక్కుంటుంది నిహారిక. ఇక పిల్లలు అంటే తనకు ఇష్టం అన్న నిహారిక రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని చెప్పుకొచ్చింది…