https://oktelugu.com/

Niharika Konidela: వివాదాల్లో చిక్కుకున్న నిహారిక కొణిదెల..నీ బాబాయ్ ఉప ముఖ్యమంత్రి..పద్దతిగా బ్రతుకు అంటూ ఫ్యాన్స్ వార్నింగ్!

మెగా ఫ్యామిలీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలా చేయలేదని, దయచేసి ఫ్యామిలీ పరువు తీసేలా ఇలాంటి కంటెంట్స్ చెయ్యొద్దని ఆమెని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి హాట్ సాంగ్స్ చేసే ముందు మీ నాన్న కి రాజకీయ నేపథ్యం ఉంది, మీ బాబాయ్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Written By: , Updated On : December 9, 2024 / 04:27 PM IST
Niharika Konidela

Niharika Konidela

Follow us on

Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చిన ప్రతీ ఒక్కరు కెరీర్ పరంగా సక్సెస్ సాధించి ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ నాగ బాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. నాగ శౌర్య తో కలిసి ఈమె చేసిన ‘ఒక మనసు’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించింది కానీ, అవి అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఆమె నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మించింది. అవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రం మాత్రం ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిల్చింది.

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఊపుతో నిహారిక కొణిదెల భవిష్యత్తులో మరి కొన్ని కంటెంట్ సినిమాలను నిర్మించి ఆడియన్స్ కి అందిస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ రీసెంట్ గా ఆమె విడుదల చేసిన ఒక వీడియో ని చూసి వాళ్లకు కళ్ళు బైర్లు కమ్మెంత పని అయ్యింది. ‘కాదల్ సడుగుడు’ అనే పాత బ్లాక్ బస్టర్ క్లాసిక్ సాంగ్ ని రీమిక్స్ చేస్తూ ఆమె ఒక హాట్ డ్యాన్స్ వీడియో ని చేసింది. నిహారిక తో పాటు హాట్ వీడియో సాంగ్ లో షానే నిగమ్ నటించాడు. ఇందులో నిహారిక హాట్ పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ, మెగా ఫ్యాన్స్ నుండి మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ఎందుకంటే వాళ్ళు నిహారిక నుండి ఇలాంటి కంటెంట్ వస్తుందని ఊహించలేదు. నిర్మాతగా సినిమాలు తీసుకుంటుంది, అలాగే కొనసాగొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలా చేయలేదని, దయచేసి ఫ్యామిలీ పరువు తీసేలా ఇలాంటి కంటెంట్స్ చెయ్యొద్దని ఆమెని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి హాట్ సాంగ్స్ చేసే ముందు మీ నాన్న కి రాజకీయ నేపథ్యం ఉంది, మీ బాబాయ్ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరికొంతమంది మాత్రం వృత్తిని వృత్తి లాగా చూస్తే ఇలాంటి కామెంట్స్ చేయరు, పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం నేడు ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నారు, నిహారిక చేస్తే తప్పేంటి?, ఆమె ఏమైనా చెయ్యకూడని పనులు చేసిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ పాటకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న విడుదల చేసిన ఈ వీడియో సాంగ్ కి ఇప్పటి వరకు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. కుర్రాళ్లలో సెగలు రేపుతున్న ఈ సాంగ్ ని చూసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి.

 

Kaadhal Sadugudu - Video Song | Madraskaaran | Shane Nigam | Niharika Konidela | B. Jagadish