RK Roja : ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ప్రకంపనలు సృష్టిస్తోంది. వసూళ్లపర్వంగా సునామీని మించుతోంది. కొద్ది రోజుల కిందట విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూలు చేస్తోంది. దీనిపై సినీ ప్రముఖులే కాదు..రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.అల్లు అర్జున్ అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి వైసీపీ నేతలు అయితే తమ ఓన్ చిత్రమని భావిస్తున్నారు. చిత్రం విడుదలైన సందర్భంలో థియేటర్ల వద్ద సందడి చేశారు. ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు. ఏకంగా జగన్ బొమ్మలతో పాటు వైసీపీ నేతల ఫోటోలతో నింపేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఏకంగా సినీ విశ్లేషకుడిగా మారిపోయారు. ఒకరిద్దరు నాయకులు నేరుగా పుష్ప సినిమాను చూసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.అయితే తాజాగా మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనతో పాటు సుకుమార్ దర్శకత్వ ప్రతిభను అభినందించారు.తమ చిత్తూరు యాసకు,అక్కడ సంస్కృతి సంప్రదాయాలకు సినిమాలో పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వైసిపి హయాంలో జగన్ అంతటి ప్రాధాన్యం ఇచ్చారని..మరోసారి పుష్ప 2 చిత్రంలో చిత్తూరు యాసకు ఎనలేని గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
* వైసిపి హయాంలో ఆ జాతర
అయితే గంగమ్మ జాతరను ప్రస్తావిస్తూ.. నాడు వైసిపి ఈ జాతరకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేస్తూ రోజా చేసిన ట్వీట్ సాగింది.’ వేటూరి గారి ఒక ఇంటర్వ్యూలో అంటాడు. అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో.. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయి అని. లెక్కల మాస్టారు సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పై చిందులేయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్టుని చాలెంజ్ గా తీసుకుని ఒక్క భాష యాసకే కాదు.. వేషానికి కూడా 100% న్యాయం చేయించారు నటీనటులతో. మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరు ఊరంతా.. రేయ్ మచ్చ ఎవడ్రా ఈడు అని మాట్లాడుకునేలా చేశారు. బాక్సాఫీస్ బద్దలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. తిరుపతి గంగ జాతరను వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది. మీరు మూడు గంటల 20 నిమిషాలు సేపు ప్రాక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్ పెర్ఫార్మెన్స్. హీరో చీర కట్టుకొని, పసుపు రాసుకుని, గంధం పూసుకుని, నిమ్మకాయల దండ మెడలో వేసుకుని, జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్లు స్క్రీన్ పై అద్భుతంగా చేసి చూపించారు ‘ అంటూ ట్వీట్ చేశారు రోజా.
* ఆ సంకేతం కోసమే
అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. వచ్చిందండి వయ్యారి అంటూ ఎక్కువమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే రోజా ఆరాటం చూస్తుంటే.. వైసిపి హయాంలో గంగమ్మ జాతర జరిగిందని.. సినిమా మొత్తం చిత్తూరు యాసలో సాగిందని.. టోటల్ గా పుష్ప 2 చిత్రం విజయం వెనుక వైసిపి ఉందని సంకేతాలు పంపించగలరు. ప్రస్తుతం రోజా ట్విట్ల మీద ట్వీట్లు కొనసాగిస్తున్నారు.
వేటూరి గారు ఒక ఇంటర్వ్యూ లో అంటాడు `అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయి`అని.
లెక్కల మాస్టారు #Sukumar గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు, మీ @SukumarWritings తో, ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా… pic.twitter.com/lks9KL4f9C
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 8, 2024