Niharika Konidela: గ్లామరస్ లుక్ లో నిహారిక… కళ్ళు జిగేల్ అనిపించే అందాలు! వైరల్ ఫోటోలు!

ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఒక మనసు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా నటించాడు. ఒక మనసు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

Written By: NARESH, Updated On : December 2, 2023 1:11 pm

Niharika Konidela

Follow us on

Niharika Konidela: నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నటిగా నిర్మాతగా ఆమె రాణించాలని కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఒక మనసు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా నటించాడు. ఒక మనసు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్య కాంతం వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ లో నటించింది. అవి కూడా ఫలితం ఇవ్వలేదు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డిలో నిహారిక చిన్న గెస్ట్ రోల్ చేసింది. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో నిహారిక పెళ్లి చేసుకుంది. గుంటూరుకు చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది.

రెండేళ్లు వీరి వైవాహిక బంధం సవ్యంగా సాగింది. కారణం తెలియదు కానీ మనస్పర్థలతో విడిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. భర్తతో విడిపోయిన నిహారిక కెరీర్ పై దృష్టి పెట్టింది. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఆన్లైన్ గేమ్స్ ఆధారంగా ఈ సిరీస్ యూత్ ఫుల్ సబ్జెక్టు తో తెరకెక్కింది. డెడ్ పిక్సెల్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నిహారిక చాలా కాలం క్రితమే ఓపెన్ చేసింది. ఈ బ్యానర్ లో బడ్జెట్ చిత్రాలు, సిరీస్ నిర్మించాలనేది ఆమె కోరిక. తన బ్యానర్ పేరిట ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక యంగ్ డైరెక్టర్స్, రచయితలతో చర్చలు జరుపుతుంది. నిర్మాతగా అలాగే నటిగా రాణించాలనేది నిహారిక కోరిక. అందుకే ఇంస్టాగ్రామ్ వేదిక గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. నిహారిక లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.