Niharika Konidela: థాయ్ లాండ్ లో నిహారిక ఎంజాయ్ మామూలుగా లేదుగా..! వైరల్ పిక్స్

హీరోయిన్ గా నిహారికకు బ్రేక్ రాలేదు. దాంతో 2020లో పెద్దల నిర్ణయం మేరకు వివాహం చేసుకున్నారు. వెంకట చైతన్య జొన్నలగడ్డ, నిహారికల వివాహం ఘనంగా రాజస్థాన్ లో జరిగింది.

Written By: NARESH, Updated On : January 13, 2024 4:53 pm

Niharika Konidela

Follow us on

Niharika Konidela: నిహారిక కొణిదెల వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. థాయిలాండ్ కి వెళ్లిన ఈ మెగా డాటర్ ఎలాంటి భయం లేకుండా ఏనుగులతో సరదాగా గడిపారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. నిహారిక ఒక మనసు మూవీతో హీరోయిన్ అయ్యారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రం పర్లేదు అనిపించుకుంది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో ఆమె నటించారు. అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఒకటి రెండు తమిళ చిత్రాలు సైతం చేశారు.

హీరోయిన్ గా నిహారికకు బ్రేక్ రాలేదు. దాంతో 2020లో పెద్దల నిర్ణయం మేరకు వివాహం చేసుకున్నారు. వెంకట చైతన్య జొన్నలగడ్డ, నిహారికల వివాహం ఘనంగా రాజస్థాన్ లో జరిగింది. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. గత ఏడాది ప్రారంభంలో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. విడాకుల అనంతరం మరలా నటనపై దృష్ఠి పెట్టింది.

డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. హాట్ స్టార్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది. పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిహారిక ఒక నిర్మాణ సంస్థ నడుపుతున్నారు. ఇటీవల దీని కోసం ఏకంగా ఆఫీస్ ఓపెన్ చేసింది. యువ దర్శకులు, రచయితలతో చర్చలు జరుపుతుంది. బడ్జెట్ మూవీస్, వెబ్ సిరీస్లు నిర్మించాలనేది నిహారిక ఆలోచన. నటిగా, నిర్మాతగా ఆమె కొనసాగాలి అనుకుంటున్నారు.

అదే సమయంలో మనసుకు నచ్చినట్లు జీవిస్తూ ఎంజాయ్ చేస్తుంది. నిహారికకు ఒక లేడీ గ్యాంగ్ ఉంది. వారితో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటుంది. తాజాగా నిహారిక థాయిలాండ్ వెళ్లారు. అక్కడి అందమైన ప్రదేశాల్లో విహరిస్తున్నారు. తన థాయిలాండ్ టూర్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా గత ఏడాది నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే…