Happy Kanuma Greetings 2024: సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు జరుపుకునేది కనుమ పండుగ. రెండు రోజుల పాటు ఆనందంగా నిర్వహించుకున్న తెలుగు ప్రజలు ఈరోజు పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కనుమను పశువుల పండుగ అని కూడా అంటారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు వాటికి ఎటువంటి పనులు చెప్పరు. పంటలు పండించడంలో పశువులు ఎంతో సాయం చేశాయని వాటిని ఈరోజు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఇక కొత్త అల్లుళ్లకు ఈరోజు మాంసాహారంతో విందును ఇస్తారు. సరదాగా వారితో కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ తరుణంలో కొందరు ఇతరులకు శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటారు. మరి కనుమ శుభాకాంక్షలు ఎలా చెబుతారో తెలుసా?
-కనుమలోని కమనీయం.. మీ జీవితాన్ని రమణీయంగా మార్చాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు
-కనుమ కమ్మని విందు.. కలకాలం మీ జీవితంలో బంధాలు నిలపాలని కోరుకుంటూ.. కనుమ శుభాకాంక్షలు.
-మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు కనుమ శుభాకాంక్షలు.
-ఈ కనుమ మీ కష్టాలను తొలగించి.. కమ్మనైన జీవితాన్ని అందించాలని కనుమ శుభాకాంక్షలు.
-ఇల్లు ధాన్యరాశులతో నిండుగా.. పాడి పంటలతో పచ్చగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కనుమ శుభాకాంక్షలు.
-కష్టానికి ప్రతిపలం కనుమ.. మనలోని మంచితనం వెలిగించే దీపం కనుమ.. మనమందరం కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ..
-రెక్కల కష్టంల చేదోడుగా నిలిచిన పశువులు.. రోకళ్లు దంచే ధాన్యాలు..మనసుల్ని నింపే మాన్యాలు.. అందరికీ కనుమ శుభాకాంక్షలు..
-మట్టిలో పుట్టిన మేలిమి బంగారం.. కష్టం చేతికొ అందొచ్చే తరుణం.. నేలతల్లి, పాడిపశువులు అందించిన వరప్రసాదం.. కనుమ శుభాకాంక్షలు.