https://oktelugu.com/

నిహారిక నాతో ఇంతకు ముందులా మాట్లాడట్లేదు: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక మ్యారేజ్ ని గుంటూరు రేంజ్ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో గతేడాది డిసెంబరు నెలలో అంగరంగ వైభవంగా చేశారు. నీహారిక పెళ్లి విషయంలో తన ఆనందాన్ని ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ని ఆయన సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు… అనేక విషయాలని చెప్తూ, పెళ్లి తర్వాత నీహారికతో రిలేషన్‌‌పై స్పందించారు. […]

Written By:
  • admin
  • , Updated On : January 24, 2021 / 03:44 PM IST
    Follow us on


    మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక మ్యారేజ్ ని గుంటూరు రేంజ్ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో గతేడాది డిసెంబరు నెలలో అంగరంగ వైభవంగా చేశారు. నీహారిక పెళ్లి విషయంలో తన ఆనందాన్ని ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ని ఆయన సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు… అనేక విషయాలని చెప్తూ, పెళ్లి తర్వాత నీహారికతో రిలేషన్‌‌పై స్పందించారు.

    Also Read: తనకు ప్రాణ హాని ఉందంటున్న అర్జున్ రెడ్డి నటి

    నీహారికతో మీకున్న బాండింగ్ గురించి చెప్పమని యాంకర్ అడిగిన ప్రశ్నకి బాదులిస్తూ… ప్రపంచంలో ఉన్న అందరి అమ్మాయిల తండ్రులలానే నేను కూడా నిహారికతో ఉన్నాను. మానవ సృష్టికి కారణం అమ్మాయిలే కారణం కాబట్టి బేసికల్ గా నాకు అమ్మాయిలంటే ఇష్టం, గౌరవమని అన్నారు. వరుణ్ తర్వాత రెండోసారి కూడా కొడుకు వద్దనుకుని అమ్మాయే కావాలని కోరుకున్నానని లక్కీగా నిహారికా పుట్టిందన్నారు. నిహారిక తనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ అని, నిజానికి తన భార్య , కొడుకుతో కన్నా నిహారికతోనే ఎక్కువ బాండింగ్,కమ్యూనికేషన్ ఉండేదని చెప్పారు.

    Also Read: శ‌ర్వానంద్ తో పోటీకి సిద్దమవుతున్న శ్రీ‌విష్ణు !

    కానీ పెళ్లయ్యాక నిహారిక తనతో మాటలాడటం కాస్త తగ్గించిందని అయినా ఈ విషయంలో మరో రకంగా నాకు సంతోషంగా ఉందని అన్నారు. వరుణ్ తో పోలిస్తే నిహారికనే ఎక్కువ అల్లరి చేస్తుందని, ఎక్కడైనా నిహారికా ఆవిధంగానే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక వరుణ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతూ నా దృష్టిలో లవ్, అరేంజ్డ్ మ్యారేజ్ వేరు కావు , అదృష్టం కొద్దీ సరైన భాగస్వాములు వస్తారని నమ్ముతాను. అలానే వరుణ్ కి ఒక మంచి అమ్మాయి భార్యగా రావాలని మాత్రమే నేను కోరుకుంటున్నానన్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్