నాగార్జున్ సాగర్లో త్వరలో ఉప ఎన్నిక జరునుంది. దీంతో పార్టీలన్నీ సాగర్ వైపు చూస్తున్నాయి. దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల్లో కారు స్పీడు బ్రేక్ పడటంతో రానున్న ఉప ఎన్నికల్లో సత్తాచాటాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది.
Also Read: వ్యవసాయ చట్టాలపై జేపీ మాట.. వైరల్
సీఎం కేసీఆర్ ఇప్పటికే నల్లొండ జిల్లాపై పెద్దఎత్తున వరాలు కురిపించారు. అలాగే గతంలో ఈ జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. నిత్యం జిల్లా నేతలతో మాట్లాడుతూ శ్రేణులు అప్రమత్తం చేస్తున్నారు.
సాగర్లో టీఆర్ఎస్ సీటు దివంగత నోముల నర్సింహాయ్య కుటుంబ సభ్యులకు ఇవ్వాలా? లేదా మరో బలమైన అభ్యర్థికి సీటు ఇవ్వాలా? అనే దానిపై సర్వే చేయిస్తున్నారు. సర్వే ఆధారంగా సాగర్ సీటు ఖరారయ్య అవకాశ ఉందని సమాచారం.
ఇక టీఆర్ఎస్ కు దుబ్బాకలో.. గ్రేటర్లో గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ సైతం సాగర్ పై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడిని బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు నల్గొండలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసురుతోంది.
సాగర్ ఎన్నిక మాత్రం కాంగ్రెస్ పార్టీకి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి సుమారు 7వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఆయనే బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. జిల్లా రాజకీయాలతో జనారెడ్డికి 40ఏళ్ల అనుభవం ఉంది. ఇది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారనుంది.
Also Read: అయోమయంలో వరద బాధితులు.. పరిహారం ఇస్తారా.. ఇవ్వారా?
జానారెడ్డి.. ఆయన కుమారుడు ఇతర పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే బ్రేక్ వేసినట్లు సమాచారం. దీంతో సాగర్లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి దొరికినట్లే. ఇప్పటికే దుబ్బాక.. గ్రేటర్లో దారుణ ఓటమిపాలైన కాంగ్రెస్ సాగర్లో సత్తాచాటాలని రేసులో ఉన్నట్లు నిరూపించుకోవాలని తహతహలాడుతోంది.
అనుకోకుండా సాగర్లో వచ్చిన ఉప ఎన్నికను కాంగ్రెస్ గోల్డెన్ ఛాన్స్ గా మార్చుకోవాలని భావిస్తోంది. ఒకవేళ సాగర్లో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఆపార్టీ అసెంబ్లీ ఎన్నికల వరకు మళ్లీ బలపడే అవకాశాలు కన్పిస్తున్నారు. దీంతో సాగర్ ఎన్నిక కాంగ్రెస్ కు చావో.. రేవో అన్నట్లు మారాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్