Nidhhi Agerwal : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం పై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. ఎంతోమంది అమాయకపు యువకులు వీటి బారిన పడి జీవితాలను కోల్పోతున్నారు. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన వాటిని కోట్లాది మంది ప్రేక్షకులను ప్రభావితం చేసేవారు ప్రమోట్ చేయడం దురదృష్టకరం, ఇలాంటి వారిపై కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఇండస్ట్రీ లోని 11 మంది సెలెబ్రిటీలపై కేసులు నమోదు చేసారు. వారిలో వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఇటీవలే ఎంపికైన ప్రముఖ యాంకర్ శ్యామల(Anchor Shyamala) కూడా ఉంది. అంతే కాకుండా విష్ణు ప్రియ(Vishnu Priya), రీతూ చౌదరి(Rithu Chowdary), హర్ష సాయి(Harsha Sai), కిరణ్ గౌడ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, టేస్టీ తేజ(Tasty Teja), సన్నీ బన్నీ యాదవ్ వంటి వారిపై కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కొంతమంది పరారీ లో ఉన్నారు.
Also Read : ‘హరి హర వీరమల్లు’ స్టోరీ మొత్తాన్ని లీక్ చేసేసిన హీరోయిన్ నిధి అగర్వాల్..వైరల్ అవుతున్న వీడియో!
ఇప్పుడు వీరి జాబితాలోకి ప్రముఖ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) కూడా చేరబోతుందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే గతం లో ఈమె ‘jeetWin’ అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా లో బాగా వైరల్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈమెపై కూడా కేసు ని నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రంలో, అదే విధంగా ప్రభాస్(Rebel star Prabhas) ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంత పెద్ద సినిమాలు చేస్తున్న హీరోయిన్ కి డబ్బులు ఏమి అవసరం ఉంటుంది?, ఎందుకు ఈ స్థాయి వ్యక్తులు కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఎంతోమందికి రోల్ మోడల్ గా ఉండాల్సిన వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ద్వారా సెలెబ్రెటీలకు కోట్లలో రెమ్యూనరేషన్ ఆశ చూపడం వల్లే వాళ్ళు ఇలా ఒప్పుకుంటున్నారని, హర్ష సాయి అనే వ్యక్తి దాదాపుగా 500 కోట్ల రూపాయిలు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించాడని అంటున్నారు. ఇకపోతే VC సజ్జనార్ ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సెలెబ్రిటీస్ పై కేసులు నమోదు చేయిస్తున్నాడు. అదే విధంగా ‘నా అన్వేషణ’ ఫేమ్ అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహిస్తున్న వాళ్లకు సంబంధించిన వివరాలను తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోల ద్వారా తెలియచేస్తున్నారు. ‘బిగ్ బాస్ 7’ టైటిల్ విన్నర్
పల్లవి ప్రశాంత్ కూడా అలాగే చేసాడని, ఇతని పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇతను ఒక నమ్మక ద్రోహి, మోసగాడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు అన్వేష్. పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు అయ్యిందా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : పడి లేచిన కెరటం ఈ హీరోయిన్: కెరీర్ అయిపోయింది అనుకుంటే, సూపర్ స్టార్స్ తో ప్రాజెక్టులు కొట్టేసింది…