Anakapalle Railway Bridge: రైల్వే వంతెన( Railway Bridge) కుంగిన ఘటన కలకలం రేపింది. అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసింది. విజయరామరాజుపేట సమీపంలో ఆదివారం రాత్రి భారీ వాహనం వంతెన కింద వెళ్తూ సేఫ్టీ గడ్దర్ ను ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ పక్కకు జరిగింది. అదే సమయంలో ఆ మార్గంలో గూడ్స్ రైలు వచ్చింది. అయితే ట్రాక్ పక్కకి జరిగిన విషయాన్ని గుర్తించాడు గూడ్స్ లోకో పైలట్. రైలును వెంటనే అక్కడ నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. మరోవైపు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
* తప్పిన పెను ప్రమాదం
అయితే ట్రాక్ పోవడాన్ని ముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ- విజయవాడ( Visakha to Vijayawada) మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కసింకోట దగ్గర గోదావరి, విశాఖ రైళ్లను నిలిపివేశారు. అదే సమయంలో ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో విశాఖ- మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి దెబ్బతిన్న ట్రాక్ లను మరమ్మత్తులు చేశారు. ఆ పనులు ముగిసిన వెంటనే రైళ్ల రాకపోకలను అనుమతించారు.
* స్థానికుల్లో ఆందోళన
రైల్వే వంతెన( Railway Bridge) కుంగి పోయిందని తెలిసి స్థానికులతో పాటు రైల్వే ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ముందే గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ రైల్వే ట్రాక్ గుర్తించకుండా రైళ్ల రాకపోకలు కొనసాగించి ఉంటే ప్రమాదాలు చోటు చేసుకునేవి. కానీ ముందే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. యుద్ధ ప్రాతిపదికన రైల్వే వంతెన మరమ్మత్తు పనులు పూర్తి చేశారు. రైళ్ల రాకపోకలను యధావిధిగా ప్రారంభించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కుంగిన రైల్వే వంతెన.. నిలిచిన రైళ్లు
అనకాపల్లి విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది.
రైల్వే ట్రాక్ దెబ్బతినగా విశాఖ-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గోదావరి, విశాఖ, మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. pic.twitter.com/2BC4amEg1X
— Bhaskar Reddy (@chicagobachi) March 17, 2025