Nidhhi Agerwal : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). మొఘల్స్ మన దేశాన్ని ఏలుతున్న రోజుల్లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని, కాస్త సినిమాటిక్ లిబర్టీ కోసం ఫిక్షన్ ని జోడించి ఈ చిత్ర కథ ని డైరెక్టర్ క్రిష్(Director Krish) ఎంతో అద్భుతంగా రాసారు. సినిమాని ఆయన 90 శాతం వరకు పూర్తి చేసారు కానీ, షూటింగ్ బాగా ఆలస్యం అవుతుండడంతో ఆయన వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుండి మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్యాచ్ వర్క్ మినహా, షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా ముగిసినట్టే. పవన్ కళ్యాణ్ కి సంబంధించి నాలుగు రోజుల డేట్స్ కావాల్సి ఉంది. ఈ నెల 21 నుండి ఆయన షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
మార్చి 28 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మూవీ టీం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది కానీ, అది కుదిరేలా లేదు. ఫస్ట్ హాఫ్ కి సంబంధించి ఎడిటింగ్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్, రీ రికార్డింగ్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట. ఫస్ట్ హాఫ్ ని ఐమాక్స్ ఫార్మటు కి కన్వెర్షన్ కూడా చేసేసారు. కానీ కొన్ని CG వర్క్స్ మాత్రం చాలా వరకు బ్యాలన్స్ ఉందట. మార్చి 10 లోపు వాటిని పూర్తి చేస్తే ఈ చిత్రం అనుకున్న విధంగానే మార్చి 28న విడుదల అవుతుంది. లేదంటే ఏప్రిల్ 11 న విడుదల అవుతుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి రెండవ పాట ‘కొల్లగొట్టినాదిరో’ ఈ నెల 24 న విడుదల చేయబోతున్నాం అంటూ మేకర్స్ నిన్న ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసారు. ఈ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఒక స్పేస్ లో ‘హరి హర వీరమల్లు’ లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్(Nidhi Agarwal) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఒక అభిమాని నిధి అగర్వాల్ ని ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమా స్టోరీ గురించి మాకు ఒక ఐడియా ఉంది. మాకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమా గురించి చెప్తారా ‘ అని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘ఈ సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చాలా హై సన్నివేశాలతో నిండిపోయి ఉంటుంది. అభిమానులు ఆశ్చర్యపోతారు. అనేక ట్విస్టులు కూడా ఉన్నాయి, అదే విధంగా ఔరంగజేబు గురించి సినిమా మొత్తం ఏమి ఉండదు , కేవలం సినిమాలో ఒక పార్ట్ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు మీరు కూడా వినండి.
#NidhhiAgerwal about #HariHaraVeeraMallu
She talks about her role in the film, her role, Aurangazeb, how the pacing of the film
will be and Roshanara pic.twitter.com/WEZMCbmsjJ— sharat (@sherry1111111) February 15, 2025