https://oktelugu.com/

Prabhas Fans: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. మారుతి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు లీక్‌..

Prabhas Fans: నేషనల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం 300 కోట్లు మార్కెట్ ఉంది. అందుకే.. ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు మారుతితో ప్రభాస్ ఒక సినిమా చేయాలనుకోవడం.. పైగా అది కూడా పాన్ ఇండియా సినిమా చేయాలనుకోవడం షాకింగ్ నిర్ణయమే. అయితే, తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ చిత్రం తాతామనవళ్ల కథతో రాబోతుంది. ప్రధానంగా […]

Written By:
  • Shiva
  • , Updated On : August 29, 2022 / 02:45 PM IST
    Follow us on

    Prabhas Fans: నేషనల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం 300 కోట్లు మార్కెట్ ఉంది. అందుకే.. ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు మారుతితో ప్రభాస్ ఒక సినిమా చేయాలనుకోవడం.. పైగా అది కూడా పాన్ ఇండియా సినిమా చేయాలనుకోవడం షాకింగ్ నిర్ణయమే. అయితే, తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ చిత్రం తాతామనవళ్ల కథతో రాబోతుంది. ప్రధానంగా పాతబడ్డ థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీ జానర్‌లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

    Prabhas, Maruthi

    ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కేవలం రెండు షెడ్యూల్స్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తిచేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షెడ్యూల్స్ కోసం హైదరాబద్ లోని ఓ స్టూడియోలో భారీ సెట్‌ను కూడా వేశారు. త్వరలోనే ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అట. అన్నిటికీ మించి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు.

    మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రస్తుతానికి అయితే.. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ మారుతితో ఈ సినిమా చేయడానికి సైన్ చేయకముందు ఒక కండీషన్ పెట్టాడు. సినిమాని మూడు నెలల్లో ఫినిష్ చేయాలనేది ఆ కండిషన్. ఎలాగూ మారుతి ఏమి చేసినా బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు. పైగా నిర్మాతలకు లాభాలు వచ్చే సినిమాలే చేస్తాడు.

    Prabhas

    అందుకే.. ప్రభాస్ షరతుకు మారుతి కూడా అన్ని రకాలుగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కింద స్థాయి నుంచి రావడంతో మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు. డైరెక్టర్ గా కూడా మారుతి బాగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే, ఇప్పటివరకు ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదు. ఒక్క వెంకటేష్ మాత్రమే డేట్స్ ఇచ్చాడు. కానీ, వెంకీతో మారుతి పెద్ద డిజాస్టర్ చేశాడు. అయితే, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో భారీ విజయం సాధించి మొత్తానికి తనలో మ్యాటర్ ఉందని బలంగా నిరూపించుకున్నాడు. అందుకే, ప్రభాస్ డేట్లు ఇచ్చినట్టు ఉన్నాడు. కానీ అంతలోనే పక్కా కమర్షియల్ అంటూ మరో ప్లాప్ సినిమా తీశాడు. మరి ఇప్పుడు ప్రభాస్ సినిమాని ఏం చేస్తాడో చూడాలి.

    Tags