https://oktelugu.com/

పాపం.. ‘భారతీయుడు 2’కి మరో సమస్య !

గ్రేట్ డైరెక్టర్ శంకర్ గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ అనగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగా ఆసక్తి చూపిస్తోంది. ఇక వీరి కలయికలో రానున్న ‘భారతీయుడు 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి అనేక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట బడ్జెట్ సమస్యతో కొన్నాళ్ళు షూటింగ్ ఆగిపోయింది. ఆ తరువాత సెట్లో పెద్ద క్రేన్ పడి శంకర్ […]

Written By:
  • admin
  • , Updated On : November 7, 2020 / 07:52 PM IST
    Follow us on


    గ్రేట్ డైరెక్టర్ శంకర్ గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ అనగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగా ఆసక్తి చూపిస్తోంది. ఇక వీరి కలయికలో రానున్న ‘భారతీయుడు 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి అనేక కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట బడ్జెట్ సమస్యతో కొన్నాళ్ళు షూటింగ్ ఆగిపోయింది. ఆ తరువాత సెట్లో పెద్ద క్రేన్ పడి శంకర్ అసిస్టెంట్ తో పాటు మరో ఇద్దరు సభ్యులు కూడా చనిపోయిన తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఇక అప్పటినుండి మళ్ళీ ఈ సినిమా మొదలుపెట్టడానికి చాల సమయమే పట్టింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    శంకర్ లాంటి డైరెక్టర్ సినిమాకి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. కమల్ హాసన్ పక్కన ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అతను పాత్ర నిడివి ఎక్కువ లేకపోయినా… కమల్ కాంబినేషన్ లో ఎక్కువుగా ఉన్నాయట. దాంతో ఆల్ రెడీ షూట్ చేసిన కొంత భాగాన్ని ఇప్పుడు మళ్ళీ రీషూట్ చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తుండటం విశేషం.

    Also Read: సమంత కొత్త జర్నీ.. సామ్ జామ్..!

    ఇక ఒక చిన్న పాత్రలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ హీరోయిన్ శ్రుతి శర్మను కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే షెడ్యూల్ లో శ్రుతి శర్మ కూడా షూట్ లో పాల్గొంటుందట. అలాగే ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్ కూడా భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషిస్తున్నాడు. కాగా యువ సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. ఇక టెక్ మాంత్రికుడు శంకర్ ఈ సినిమాని కూడా తన శైలిలోనే భారీ హంగులతోనే తీర్చిదిద్దుతున్నాడు. 2021లో ఈ సినిమా విడుదలకానుంది.