https://oktelugu.com/

ఓటీటీలో విడుదలైన థ్రిల్లర్స్ లో ఇదే బెస్ట్ చిత్రం

కరోనా ఎఫెక్టుతో థియేటర్లు మూతపడటంతో గత ఆరేడు నెలలుగా ఓటీటీలు కళకళలాడాయి. కొత్త సినిమాలన్నీ కూడా ఓటీటీల్లో రిలీజు కావడంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా వీటికి అలవాటుపడ్డారు. అయితే ఓటీటీల్లో రిలీజైన సినిమాలన్నీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.తాాజాగా ఓటీటీలో రిలీజైన ‘గతం’ మూవీ మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఓటీటీల్లో ఇటీవల రిలీజైన నాని ‘వి’.. కీర్తి సురేష్ ‘పెంగ్విన్’.. అనుష్క ‘నిశబ్దం’ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 8, 2020 10:38 am
    Follow us on

    కరోనా ఎఫెక్టుతో థియేటర్లు మూతపడటంతో గత ఆరేడు నెలలుగా ఓటీటీలు కళకళలాడాయి. కొత్త సినిమాలన్నీ కూడా ఓటీటీల్లో రిలీజు కావడంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా వీటికి అలవాటుపడ్డారు. అయితే ఓటీటీల్లో రిలీజైన సినిమాలన్నీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.తాాజాగా ఓటీటీలో రిలీజైన ‘గతం’ మూవీ మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఓటీటీల్లో ఇటీవల రిలీజైన నాని ‘వి’.. కీర్తి సురేష్ ‘పెంగ్విన్’.. అనుష్క ‘నిశబ్దం’ సినిమాలన్నీ అభిమానులను నిరాశపరిచాయి. ఈక్రమంలోనే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో ‘గతం’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ విడుదలైంది. ‘గతం’ చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ సూపర్ హిట్ టాక్ తో విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది.

    Also Read: దీపావళికి స్పెషల్.. బన్నీ – త్రివిక్రమ్ నుండి.. !

    ‘గతం’ సినిమా విషయానికొస్తే అమెరికాలో యాక్సిడెంట్లో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రి చికిత్స తీసుకొని కోలుకుంటాడు. అయితే ఆ వ్యక్తి గతాన్ని మరిచిపోతాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ సాయంతో అతడు తన తండ్రి దగ్గరకు చేరే క్రమంలో వారికి ఎదురైన అనుకోని సంఘటనలే ఈ సినిమా కథ. ఈ మూవీలో భార్గవ పోలుదాసు.. రాకేశ్ గలేభే.. పూజిత కురపర్తి ప్రధాన పాత్రల్లో నటించారు.

    Also Read: పాపం.. ‘భారతీయుడు 2’కి మరో సమస్య !

    గతం మూవీని అమెరికాలోని కొందరు ఔత్సాహిక సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు క్రౌడ్ ఫండింగ్ తో ఎస్.ఒరిజినల్స్.. ఆఫ్ బీట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై నిర్మించారు. ‘గతం’ సినిమా విజువల్స్ హాలీవుడ్ స్టైల్లో ఆకట్టుకున్నాయి. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆద్యంతం ఆకట్టుకుంది. తక్కువ నిడివితో సినిమా ఉన్నప్పటికీ అదిరిపోయే ట్వీస్టులు.. టర్నింగ్ పాయింట్స్ చివరివరకు ఆకట్టుకుంది.