https://oktelugu.com/

ప్చ్.. శేఖర్ కమ్ములకు కొత్త తలనొప్పి !

అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా పక్కన వుండిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా వెయిటింగ్ లిస్టులో ఉంది . వెయిటింగ్ ఎక్కువ అవ్వడం ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములకు శాపంలా మారింది. కరోనా మొదటి సీజన్ తరువాత ముందుగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి స్పీడ్ గా ఫస్ట్ కాపీ రెడీ చేసి, శేఖర్ […]

Written By:
  • admin
  • , Updated On : May 30, 2021 / 06:05 PM IST
    Follow us on

    అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా పక్కన వుండిపోయిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా వెయిటింగ్ లిస్టులో ఉంది . వెయిటింగ్ ఎక్కువ అవ్వడం ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములకు శాపంలా మారింది.

    కరోనా మొదటి సీజన్ తరువాత ముందుగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి స్పీడ్ గా ఫస్ట్ కాపీ రెడీ చేసి, శేఖర్ కమ్ముల అనవసరంగా తనకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టుకునట్టు అయింది . ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తీ అయినా, ఎవరో ఒకరు సినిమా చూస్తున్నారు.

    వారికీ తోచిన మార్పులు సూచిస్తున్నారు. ఆ మార్పులు శేఖర్ కమ్ములకు ఇష్టం లేకపోయినా.. నిర్మాతల బలవంతంతో మళ్ళీ ఆ మార్పుల పై శేఖర్ కమ్ముల కూర్చోవాల్సి వస్తోందట. ఆసియన్ సునీల్ కి ఒక పట్టానా ఏది నచ్చదు. మరోపక్క శేఖర్ కమ్ములకు అద్భుతంగా చెప్పి ఒప్పించే స్కిల్ లేదు.

    అందుకే నిర్మాతలను ఒప్పించలేక ఇబ్బంది పడుతున్నాడు. మరీ చివరకు శేఖర్ కమ్ముల ఏమి చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా దసరాకి విడుదల చేయాలని నిర్మాత సునీల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు దసరాకి రుమాలు వేసుకున్నాయి. కానీ సునీల్ కు నైజాంలో స్వంత థియేటర్లు భారీగా ఉన్నాయి.

    కాబట్టి, కచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అసలకే శేఖర్ కమ్ముల సినిమాలు బాగా స్లోగా ఉంటాయి. స్లో సినిమాకి పోటీగా కమర్షియల్ సినిమా రిలీజ్ అయితే ఏమిటి పరిస్థితి అనేది ఎవ్వరికి అంతుపట్టని పరిస్థితి.