New-OTT-releases-to-watch-this-weekend
OTT releases this week: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే. ఏకంగా 17 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో టిల్లు స్క్వేర్, భీమ వంటి క్రేజీ చిత్రాలు ఉన్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న థియేటర్స్ లోకి వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ. 125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మాలిక్ రామ్ దర్శకుడు.
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాలు ముగిసిన నేపథ్యంలో ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది. టిల్లు స్క్వేర్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 26 నుండి టిల్లు స్క్వేర్ స్ట్రీమ్ కానుంది. అలాగే మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన భీమ సైతం ఓటీటీలోకి వచ్చేస్తుంది. హాట్ స్టార్ భీమ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25 నుండి భీమ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
భీమ చిత్రానికి ఏ హర్ష దర్శకుడు. గోపిచంద్ కి జంటగా ప్రియా భవాని శంకర్ నటించింది. ఈ రెండు తెలుగు చిత్రాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి. అవేమిటో? ఈ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ అవుతున్నాయో చూద్దాం…
హాట్ స్టార్
భీమ – ఏప్రిల్ 25
థ్యాంక్ యూ గుడ్ నైట్(ఇంగ్లీష్ సిరీస్)-ఏప్రిల్ 26
క్రాక్(హిందీ చిత్రం)-ఏప్రిల్ 26
అమెజాన్ ప్రైమ్
దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్)- ఏప్రిల్ 25
నెట్ఫ్లిక్స్
బ్రిగంటి(ఇటాలియన్ సిరీస్)- ఏప్రిల్ 23
ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ సిరీస్)-ఏప్రిల్ 23
డెలివరీ మీ (స్వీడిష్ సిరీస్)- ఏప్రిల్ 24
సిటీ హంటర్(జపనీస్ సినిమా)- ఏప్రిల్ 25
డెడ్ బాయ్ డిటెక్టీవ్స్(ఇంగ్లీష్ సిరీస్)-ఏప్రిల్ 25
టిల్లు స్క్వేర్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 26
గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్)-ఏప్రిల్ 26
ద అసుంత కేస్(స్పానిష్ సిరీస్)-ఏప్రిల్ 26
జియో సినిమా
ది జింక్స్ పార్ట్ 2(ఇంగ్లీష్ సిరీస్)-ఏప్రిల్ 23
వియార్ హియర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 27
ఆపిల్ ప్లస్ టీవీ
ది బిగ్ డోర్ ప్రైజ్ సీజన్ 2(ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 24
బుక్ మై షో
కుంగ్ ఫు పాండా 4(ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ ఏప్రిల్ 26
లయన్స్ గేట్ ప్లే
ది బీ కీపర్(ఇంగ్లీష్ సినిమా)- ఏప్రిల్ 26
Web Title: New ott releases to watch this weekend
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com