Netizens Trolling Tamil Directors: ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేవి. ఎందుకంటే తమిళ్ డైరెక్టర్లు డిఫరెంట్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తారు అనే ఒక గొప్ప పేరు నైతే సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఒక్క సినిమాతో కూడా సక్సెస్ ని సాధించలేకపోతున్నారు. స్టార్ట్ డైరెక్టర్ల దగ్గర్నుంచి చిన్న దర్శకుల వరకు ఎవ్వరు కూడా వాళ్ళు ఆశించిన మేరకు విజయాలను సాధించకపోవడంతో పాన్ ఇండియాలో తమిళ్ డైరెక్టర్ ల హవా చాలా వరకు తగ్గింది. మణిరత్నం, శంకర్, మురుగదాస్, లోకేష్ కనకరాజు లాంటి స్టార్ డైరెక్టర్లందరు కూడా వరుసగా డిజాస్టర్ల బాధపడుతూ ఉండడం విశేషం… ఇక ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ నలుగురు దర్శకులు భారీగా డిజాస్టర్లను మూటగట్టుకోవడంతో ఈ సంవత్సరం తమిళ్ సినిమా ఇండస్ట్రీకి అసలు కలిసి రావడం లేదు అంటూ చాలామంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇక దీనికి తోడుగా మురుగదాస్ రీసెంట్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఆ దాన్ని ఆధారంగా చేసుకుని నెటిజన్లు ఆయన మీద విరుచుకుపడుతున్నారు.
అదేంటి అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలోని దర్శకులను ఇతర దర్శకులతో పోల్చకూడదని వాళ్లకు సపరేట్ స్టైల్ ఉందని, వాళ్ళు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమాలు కాకుండా ఎడ్యుకేట్ చేసే సినిమాలను చేస్తారని చెప్పాడు. దాంతో చాలామంది అప్పటినుంచి తన మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘మదరాసి’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో మురుగదాస్ ను ఉద్దేశించి ఎడ్యుకేట్ చేసే సినిమాలను చేయవయ్యా అంటూ అతని మీద ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి ఈ సంవత్సరం అనేది చాలా వరకు కలిసి రాలేదనే చెప్పాలి.
ఇకమీదట రాబోతున్న సినిమాలతో అయిన పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీని బీట్ చేస్తూ ముందుకు వెళ్లగలిగే కెపాసిటీ తమిళ్ దర్శకుల దగ్గర ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సంవత్సరం మరికొన్ని పెద్ద సినిమాలు రాబోతున్నాయి కాబట్టి వాటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి…