Bigg Boss 9 Telugu: టెలివిజన్ రంగంలో అత్యంత టాప్ మోస్ట్ రియాల్టీ షో గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏకైక గేమ్ షో బిగ్ బాస్…ఇక ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా 8 సీజన్స్ ను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో ప్రస్తుతం 9 వ సీజన్ స్టార్ట్ అవుతోంది. ఇక రేపటి నుంచి ఈ షో స్టార్ మా లో టెలికాస్ట్ అవ్వబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక దానికోసం ఇప్పటికే 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లను అనౌన్స్ చేశారు. అలాగే అగ్నిపరీక్ష ద్వారా మరొక ఐదుగురిని సెలెక్ట్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళతో పాటు ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి ఇంకొంతమంది స్పెషల్ గెస్ట్ లను కూడా ఇందులో భాగం చేయబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి… ఆ గెస్ట్ లు ఎవరు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం హౌజ్ లోకి రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కనుక ఈ షోలో ఒక్కరోజు గెస్ట్ గా వచ్చినా కూడా విపరీతమైన టిఆర్పి రేటింగ్ వస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
మరి తను అనుకున్నట్టుగానే ఆర్జీవి సైతం ఈ షోలో ఒక్కరోజు కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది…ఇక ఆయన ఎప్పుడు ఈ షోలోకి ఎంట్రీ ఇస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక బిగ్ బాస్ యాజమాన్యం సైతం ఆయనను ఎప్పుడు ఇంట్లోకి పంపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంలో ఆలోచిస్తున్నారట.
మరి ఈ షో టెలికాస్ట్ అయి దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకొని కొంచెం డౌన్ అయ్యే సమయంలో ఆర్జీవిని పంపించాలనే ఉద్దేశ్యంతో షో యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే వర్మ షో రేటింగ్ ను అమాంతం పెంచేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఆయన ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
రీసెంట్ గా వర్మ తనకు నచ్చిన సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతున్నాడు. మరి స్టార్ హీరోలతో గాని, కొంచెం ఫేమ్ ఉన్న హీరోలతో గాని ఆయన ప్రస్తుతానికైతే సినిమాలు చేయడం లేదు. కారణం ఏదైనా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఆయన ఎవ్వరిని పట్టించుకోవడం లేదు…